చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగ విరుద్దమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత‌ మోత్కుపల్లి న‌ర్సింహులు అన్నారు. నాలుగు నెలల తర్వాత జగన్ జైలుకు పోవాల్సిందేన‌ని జోష్యం చెప్పారు. 2019లో జగన్‌ను గెలపించమని ప్రజలను కోరి పొరపాటు చేశానని అన్నారు.

చంద్రబాబు(Chandrababu) అరెస్ట్ రాజ్యాంగ విరుద్దమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత‌ మోత్కుపల్లి న‌ర్సింహులు(Motkupalli Narasimhulu) అన్నారు. నాలుగు నెలల తర్వాత జగన్(Jagan) జైలుకు పోవాల్సిందేన‌ని జోష్యం చెప్పారు. 2019లో జగన్‌ను గెలపించమని ప్రజలను కోరి పొరపాటు చేశానని అన్నారు. అప్పట్లో జగన్ కు మద్దతు ఇచ్చినందుకు తల దించుకుంటున్నానని పేర్కొన్నారు. ఎవరిని ఎలా చంపాలి.. ఎలా అణిచివేయాలనేదే జగన్ ఆలోచన అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. సీఎం‌ జగన్ కు నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) ఉసురు కచ్చితంగా తగులుతుందని అన్నారు.

గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయటం దుర్మార్గం అన్నారు. ముఖ్యమంత్రిగా ఎల్ల కాలం ఉండడని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. లోకేష్ ను కూడా అరెస్ట్ చేయాలనుకోవ‌టం అన్యాయం అన్నారు. ముష్టి రూ.300 కోట్లకు చంద్రబాబు ఆశపడతాడంటే ప్రజలు నమ్మటం లేద‌న్నారు. చంద్రబాబును ఇబ్బంది పెడితే రాజకీయంగా జగన్ కే నష్టం అన్నారు. జగన్ మళ్ళీ గెలిస్తే.‌. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రావణకాష్టం కావటం ఖాయం అన్నారు.

151 కాదు.. నాలుగు సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో జగన్ కు రావని జోష్యం చెప్పారు. తల్లిని, చెల్లిని ఎన్నికల్లో వాడుకుని బయటకు పంపిన చరిత్ర జగన్ ది అని అన్నారు. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండా కట్టుబట్టలతో షర్మిలను బయటకు పంపాడని ఆరోపించారు. సొంత బాబాయ్ ను చంపిన నేరస్థులను పట్టుకోలేని అసమర్థుడు జగన్ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జగన్ కపట ప్రేమను దేవుడు కూడా క్షమించడని అన్నారు. జగన్ పాలనలో ఏపీలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Updated On 24 Sep 2023 1:44 AM GMT
Yagnik

Yagnik

Next Story