తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth reddy) అల్లుడు గొలుగూరి సత్యనారాయణకు చెందిన Maxbien ఫార్మా కంపెనీపై(Maxien Pharma comapny) బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌(Krishank) ఈడీకి(ED) ఫిర్యాదు చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth reddy) అల్లుడు గొలుగూరి సత్యనారాయణకు చెందిన Maxbien ఫార్మా కంపెనీపై(Maxien Pharma comapny) బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌(Krishank) ఈడీకి(ED) ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఆదేశాలతో న్యూఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో కచ్చితమైన ఆధారాలతో క్రిశాంత్ కంప్లయింట్‌ చేశారు. కొడంగల్లో ఫార్మా కంపెనీ కోసం భూసేకరణ కార్యక్రమం రేవంత్ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. అల్లుడి కంపెనీ కోసం భూములు ఇచ్చేది లేదని స్థానిక రైతులు స్పష్టం చేసిన విషయం కూడా తెలిసిందే. రేవంత్‌ అల్లుడు డైరెక్టర్‌గా ఉన్న Maxbien ఫార్మా సంస్థలోఆయనకు 16 లక్షల షేర్లు ఉన్నాయి. మరో డైరెక్టర్‌గా ఉన్న అన్నం శరత్‌కు 21 లక్షల షేర్లు ఉన్నాయి. రేవంత్ అల్లుడి కుటుంబంపై ఇప్పటికే EDలో కేసులు నమోదయ్యాయి. విచారణలో భాగంగా ED గొలుగూరి రామకృష్ణ ను ముద్దయిగా చేర్చి కోట్ల రూపాయల బ్యాంక్ కుంభకోణానికి పాల్పడ్డారని, ఈ నిధులను ఇతర కుటుంబ సభ్యులకు మరియు ఇతర వ్యాపారాలకు తరలించారని ఈడీ ఒక ప్రకటనలో పేర్కొన్నది. గోలుగూరి రామకృష్ణ మరియు గొలుగూరి వెంకట్ రెడ్డి, ఇద్దరూ సోదరులే కాకుండా చాలా కంపెనీల్లో డైరెక్టర్ గా వ్యాపారాలు చేస్తున్నారు. వీరి అబ్బాయి గొలుగూరి వెంకట్ రెడ్డి, Maxbien ఫార్మా యొక్క డైరెక్టర్. ఈడీ పేర్కొన్నట్టు కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు ఈ కంపెనీలోకి కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉన్నది. గొలుగూరి కుటుంబ సభ్యులపై ఇప్పటికే ఎన్నో బ్యాంక్ ఎగవేత కేసులు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈడీ రేవంత్ అల్లుడు Maxbien ఫార్మ ఆర్థిక లావాదేవీలపై కూడా విచారణ చేపట్టాలని ఈడీని కోరారు క్రిశాంత్‌.

Eha Tv

Eha Tv

Next Story