ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దేశ రాజధానిలోని తీహార్‌ జైలు నుంచి విడుదలైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె కవిత ఈరోజు సాయంత్రం హైద‌రాబాద్‌ చేరుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దేశ రాజధానిలోని తీహార్‌ జైలు నుంచి విడుదలైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె కవిత ఈరోజు సాయంత్రం హైద‌రాబాద్‌ చేరుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం రాత్రి ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో కవిత బస చేశారు.

కవిత సాయంత్రం 5.45 గంటలకు హైద‌రాబాద్ విమానాశ్ర‌యానికి చేరుకుంటారు. అక్క‌డి నుంచి బ‌య‌లుదేరి ఆమె త‌న తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసే అవ‌కాశం ఉంది. అంత‌కుముందు ఆమెకు విమానాశ్రయంలో బీఆర్‌ఎస్ క్యాడర్ ఘ‌న‌ స్వాగతం పలుకుతుందని పార్టీ వర్గాలు పీటీఐకి తెలిపాయి.

ఈ ఏడాది మార్చిలో అరెస్టయిన బీఆర్‌ఎస్ నాయకురాలు కవిత 166 రోజుల జైలు జీవితం అనంత‌రం మంగళవారం రాత్రి తీహార్ జైలు నుంచి విడుద‌ల‌య్యారు. కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు అమెకు స్వాగతం పలికారు. జైలు నుంచి బయటకు వచ్చిన క‌విత‌ తన భర్త, పిల్లలు, సోదరుడు కేటీఆర్‌ను చూసి భావోద్వేగానికి గురయ్యారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story