కాంగ్రెస్, బీజేపీల రహస్యమైత్రి మరోసారి బయటపడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ..

BRS Leader Harish Rao Comments on Governor Tamilisai
కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)ల రహస్యమైత్రి మరోసారి బయటపడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) సీనియర్ నేత హరీష్ రావు(Harish Rao) అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. గవర్నర్(Governor) కోటా ఎమ్మెల్సీ(MLC)ల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయింది. బీజేపీ(BJP) ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి గవర్నర్ నిరాకరించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారు. ఇది ద్వంద్వ నీతి కాదా ? కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించడం కాదా.? అని ప్రశ్నించారు.
గతంలో కూడా క్రీడా , సాంస్కృతిక , విద్యా సామాజిక , సేవ రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. అప్పుడు కూడా గవర్నర్ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఆమోదించారు.? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కాలని చూస్తున్నాయి. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరం. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలి. కానీ బిఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు తేడా చూపిస్తున్నారని అన్నారు.
