బి.ఆర్.ఎస్. పార్టీ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.

బి.ఆర్.ఎస్. పార్టీ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్(Errolla Srinivas) ను అరెస్ట్ చేసిన పోలీసులు. కౌశిక్ రెడ్డి(Koushik reddy) అరెస్ట్ నేపథ్యంలో శ్రీనివాస్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు అని, విధులకు ఆటంకం కలిగించాడని ఆరోపణలు ఉన్నాయి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. బంజారాహిల్స్ లో నమోదు అయిన కేసులో ఎర్రోళ్ల శ్రీనివాస్ ను విచారించడానికి నోటీసులు ఇవ్వడానికి మాసబ్ ట్యాంక్ పోలీసులు.. వెస్ట్ మారెడ్ పల్లి లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లారు. అయితే ఎర్రోళ్ల శ్రీనివాస్ మాత్రం ఇంట్లో నుండి బయటకి రాలేదు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. గతంలో పోలీసులు బి.ఆర్.ఎస్. నాయకుల అరెస్ట్ నేపథ్యంలో ప్రభుత్వ విదానాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు ఎర్రోళ్ల శ్రీనివాస్. అటు బి. ఆర్.ఎస్. సీనియర్ నాయకుడు హరీష్ రావు ఈ అరెస్ట్ ను ఖండించారు. ఈ అరెస్ట్ విషయం తెలిసి పార్టీ కార్యకర్తలు శ్రీనివాస్ ఇంటివద్దకు చేరుకున్నారు.

Eha Tv

Eha Tv

Next Story