తనపై వచ్చిన భూకబ్జా కేసుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటుగా స్పందించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో దయాకర్‌రావు మాట్లాడుతూ..

తనపై వచ్చిన భూకబ్జా కేసుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటుగా స్పందించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో దయాకర్‌రావు మాట్లాడుతూ.. ‘గత 40 ఏళ్లుగా నా రాజకీయ జీవితంలో ఎంతో నిజాయితీగా ప‌నిచేశాన‌ని తెలిపారు. శరణ్ చౌదరి అనే వ్యక్తి నాపై ఆరోపణలు చేశాడు. ఆయన గతంలో బీజేపీతో సంబంధం కలిగి ఉన్నారని, భూకబ్జాలు, అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పార్టీ నుంచి తొలగించారని నాకు తెలిసింది. ఎన్నారైలను కూడా కోట్లాది రూపాయల మోసం చేసినట్లు తెలుస్తోంది. అయితే, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదని ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు.

"విజయవాడకు చెందిన విజయ్ అనే ఎన్నారై నుంచి శరణ్ చౌదరి రూ. 5 కోట్లు తీసుకున్నాడు. విజయ్ అతనిపై చీటింగ్ కేసు పెట్టాడు. శరణ్‌పై చాలా చీటింగ్ కేసులు ఉన్నాయి. పోలీసులు అతని భార్య పాస్‌పోర్ట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు" అని దయాకర్ రావు వీడియోను పంచుకున్నారు. NRI విజయ్. విజయ్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు.

2023 ఆగస్టులో తనను అక్రమంగా నిర్బంధించి, దాడి చేసి డబ్బు వసూలు చేశారని టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్‌డీ రాధా కిషన్‌రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర్ రావులపై శరణ్ చౌదరి ఫిర్యాదు చేశారు.

Updated On 26 March 2024 2:17 AM GMT
Yagnik

Yagnik

Next Story