కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెట్టడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నదే కానీ ప్రగతి గేర్లను మార్చడం లేదని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అన్నారు. ఇది కేవలం నేమ్ చేంజింగ్ గవర్నమెంటే కానీ గేమ్ చేజింగ్ గవర్నమెంట్ కాదన్న విషయం ఈ బడ్జెట్ ను చూస్తే అర్థమవుతుతోందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) పాత పేర్లను మార్చి కొత్త పేర్లు పెట్టడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నదే కానీ ప్రగతి గేర్లను మార్చడం లేదని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అన్నారు. ఇది కేవలం నేమ్ చేంజింగ్ గవర్నమెంటే కానీ గేమ్ చేజింగ్ గవర్నమెంట్ కాదన్న విషయం ఈ బడ్జెట్ ను చూస్తే అర్థమవుతుతోందన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పేరిట ఆడబిడ్డల వివాహాలకు కేసీఆర్(KCR) ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున అందించేదని, దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని,కానీ దానికి నిధులు కేటాయించకపోవడమే కాకుండా కనీసం బడ్జెట్ లో ప్రస్తావించలేదని కవిత విమర్శించారు. ఆశా వర్కర్ల జీతాలను 18 వేల రూపాయలకు పెంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, దాన్ని కూడా బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని బడ్జెట్ ద్వారా నిరూపించుకోలేకపోయిందని విమర్శించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కేటాయింపులు చేయకుండా కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే బడ్జెట్ పరిమితమైందని అన్నారు. మైనారిటీ సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం చాలా మాటలు మాట్లాడిందని, ఇమాంలకు, మోజమ్లకు 10 వేల రూపాయలు ఇస్తామని, పిల్లల కోసం తౌఫే తాలిమ్ ను మొదలుపెడుతామని కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో చేర్చి బడ్జెట్ లో విస్మరించిందని కవిత విమర్శించారు.