సర్వేల(Survey) సంగతేమిటో కానీ జనంనాడి మాత్రం జడ్చర్లలో(Jadcharla) డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి(C.Lakshma Reddy) హ్యాట్రిక్‌ సాధించడం ఖాయమని చెబుతోంది. తమ ఆత్మీయ నేత లక్ష్మారెడ్డిని నాలుగోసారి ఎమ్మెల్యేగా చూడాలని జడ్చర్ల ప్రజలు అనుకుంటున్నారు. లక్ష్మారెడ్డికి స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ్నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎవరూ గెలవలేదు.

సర్వేల(Survey) సంగతేమిటో కానీ జనంనాడి మాత్రం జడ్చర్లలో(Jadcharla) డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి(C.Lakshma Reddy) హ్యాట్రిక్‌ సాధించడం ఖాయమని చెబుతోంది. తమ ఆత్మీయ నేత లక్ష్మారెడ్డిని నాలుగోసారి ఎమ్మెల్యేగా చూడాలని జడ్చర్ల ప్రజలు అనుకుంటున్నారు. లక్ష్మారెడ్డికి స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ్నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎవరూ గెలవలేదు. దాన్ని లక్ష్మారెడ్డి బ్రేక్‌ చేయబోతున్నారు. లక్ష్మారెడ్డికి విజయాలు కొత్త కాదు.. 2004లోనే ఆయన ఎమ్మెల్యే(MLA) అయ్యారు. జడ్చర్ల అభివృద్ధిలో ప్రధానభూమికను పోషించారు. సమగ్రాభివృద్ధి కోసం పాటుపడుతున్న లక్ష్మారెడ్డిని మరోసారి గెలిపించుకోవాలని ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌(BRS) అభ్యర్థి అనిరుధ్‌రెడ్డి(Anirudh Reddy) గెలుస్తారని అన్నవారంతా ఇప్పుడు లక్ష్మారెడ్డికి వస్తున్న ఆదరణ చూసి మాట మారుస్తున్నారు. ఏ మండలానికి వెళ్లినా లక్ష్మారెడ్డి జనం నీరాజనాలు పలుకుతున్నారు. తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వం చేసిన గొప్ప పనులను ప్రజలకు అర్థమయ్యేట్టుగా వివరించడంలో లక్ష్మారెడ్డి సక్సెసయ్యారు. ప్రజలు కూడా మంచి చేసినవారికే పట్టం కట్టాలని డిసైడయ్యారు. పది రోజుల కిందట వరకు నెక్‌ టు నెక్‌ ఫైట్‌ అనుకున్నారు. ప్రస్తుతం మాత్రం వార్‌ వన్‌సైడ్‌గా ఉంది. లక్ష్మారెడ్డి విజయం నల్లేరు మీద నడక కానుంది.

Updated On 25 Nov 2023 5:20 AM GMT
Ehatv

Ehatv

Next Story