KTR At Niloufer Cafe : నీలోఫర్ కేఫ్‌లో మంత్రి కేటీఆర్ సందడి
ఎన్నికల ప్రచారంలో(Election Campaing) బిజీ బిజీ గా ఉంటున్న బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) బంజారాహిల్స్‌లోని(Banjara hills) నీలోఫర్ కేఫ్‌లో సందడి చేశారు. ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంగా నీలోఫర్ కేఫ్(Niloufer Cafe) కు వచ్చిన మంత్రి కేటీఆర్ అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు. నీలోఫర్ కేఫ్‌లో చాయ్ తాగుతున్న పలు కుటుంబాలతో గడిపారు.

KTR At Niloufer Cafe
ఎన్నికల ప్రచారంలో(Election campaign) బిజీ బిజీ గా ఉంటున్న బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) బంజారాహిల్స్‌లోని(Banjara hills) నీలోఫర్ కేఫ్‌లో సందడి చేశారు. ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చే సందర్భంగా నీలోఫర్ కేఫ్(Niloufer Cafe) కు వచ్చిన మంత్రి కేటీఆర్ అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు. నీలోఫర్ కేఫ్‌లో చాయ్ తాగుతున్న పలు కుటుంబాలతో గడిపారు.
ఈ సందర్భంగా పలువురు మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా హైదరాబాద్ డెవలప్‌మెంట్‌ను(Hyderabad Development) మెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు చాలా బాగున్నాయని కొనియాడారు. బెంగళూరులో పని చేస్తున్న యువకుడి కుటుంబంతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. బెంగళూరు నుంచి వచ్చిన ప్రతిసారీ హైదరాబాద్ నగరం వినూత్నంగా మారుతుందన్నారు. ముఖ్యంగా గత పదేళ్లలో హైదరాబాద్ అద్భుతంగా మార్పు చెందిందని యువకుడు తెలిపారు. వారణాసి నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన మాకు హైదరాబాద్ గత పది సంవత్సరాల్లో మారిన తీరు పట్ల ఓ కుటుంబం సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి జీవించే వాతావరణన్ని కలిగి ఉందన్నారు. ఆ తర్వాత పలువురు మహిళలతో మంత్రి కేటీఆర్ సంభాషించారు. తన కొడుకుకి మీరంటే చాలా అభిమానమని ఓ మహిళ కేటీఆర్‌కు తెలిపారు. ప్రభుత్వ పనితీరు పట్ల పలువురు మహిళల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు కేటీఆర్.
ఆ తర్వాత మైనారిటీ కుటుంబంతో ముచ్చటించిన కేటీఆర్, వారి నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందుతోందని, ముఖ్యంగా మత ఘర్షణలు లేకుండా అందరికీ అన్ని అవకాశాలు అందిస్తున్నారని మైనార్టీ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. మంత్రి కేటీఆర్ ఒక సాధారణ వ్యక్తిలాగా టీ తాగుతూ పలువురి మాట్లాడడం చాలామందిని ఆకట్టుకుంది. కేటీఆర్‌తో పలువురు సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపించారు.
