రుణమాఫీ(Runamafi) కాని రైతుల(Farmer) నుంచి దరఖాస్తులకు డబ్బులు వసూలు చేస్తుండటంపై బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు.
రుణమాఫీ(Runamafi) కాని రైతుల(Farmer) నుంచి దరఖాస్తులకు డబ్బులు వసూలు చేస్తుండటంపై బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. మాఫీ కాని రుణమాఫీ ఓ వైపు .. దరఖాస్తుల పేరుతో కొత్త దోపిడీ మరోవైపు రైతుల కంట నీరు తెప్పిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రైతు పై రేవంత్ సర్కార్ ముప్పేట దాడి చేస్తున్నదని మండిపడ్డారు. నిత్యం గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ఇదేనా ప్రజాపాలన అని కేటీఆర్ నిలదీశారు. రుణమాఫీ కాలేదని దరఖాస్తు చేసుకోవడానికి వస్తే రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తారా? అని ప్రశ్నించారు. ఇంకా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి ఇంకెప్పుడూ రుణమాఫీ చేస్తారు?
దరఖాస్తుల పేరుతొ ఇలా రైతుల నుంచి డబ్బులు వసూలు చేసి రుణమాఫీ చేద్దాం అనుకుంటున్నారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పేద రైతుల ఉసురు మీకు కచ్చితంగా తలుగుతుందని కేటీఆర్ చెప్పారు.