బీజేపీలో(BJP) బీఆర్‌ఎస్‌(BRS) విలీనం(alliance) చేస్తారన్న వార్తలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ ఘాటుగా స్పందించారు.

బీజేపీలో(BJP) బీఆర్‌ఎస్‌(BRS) విలీనం(alliance) చేస్తారన్న వార్తలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ ఘాటుగా స్పందించారు. తన సోషల్‌ మీడియా 'ఎక్స్'(Twitter) అకౌంట్‌ నుంచి ట్వీట్‌ చేశారు. 24 ఏళ్లు రాష్ట్రంలో కోసం పరితపించాం. వందలాది మంది విధ్వంసకారులకు వ్యతిరేకంగా, వేలాది మంది ఫేక్ ప్రచారాలకు వ్యతిరేకంగా 24 ఏళ్లుగా నిలబడ్డాం. అలుపెరుగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెచ్చుకున్న రాష్ట్రాన్ని ప్రగతికి గర్వకారణంగా నిలిపా. మన రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల్లు చూసి అనుకరించాల్సిన పరిస్థితిని నెలకొల్పాం. కొందరు రహస్య ఎజెండాలతో నిరాధారమైన పుకార్లను వ్యాప్తి చేసే వారికి, ఇదే మీ చివరి హెచ్చరిక. BRSకి వ్యతిరేకంగా మీ హానికరమైన అబద్ధాలకు వివరణ ప్రచురించండి లేదా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేటీఆర్‌ హెచ్చరించారు. రెండు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ సేవలందిస్తూనే ఉంటుంది. నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేయడం ఆపండని అని సూచించారు. పడిపోతాం, లేస్తాం, పోరాడేది తెలంగాణ కోసమే! మేము ఎన్నటికీ తలవంచము. ఇప్పుడు కాదు, ఎప్పుడూ కాదు! జై తెలంగాణ! అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

Eha Tv

Eha Tv

Next Story