ఢిల్లీలో(Delhi) బీఆర్‌ఎస్(BRS) సీనియర్లు న్యాయవాదులతో(Senior Lawyers) మంతనాలు జరుపుతున్నారు.
ఢిల్లీలో(Delhi) బీఆర్‌ఎస్(BRS) సీనియర్లు న్యాయవాదులతో(Senior Lawyers) మంతనాలు జరుపుతున్నారు. పార్టీ మారిన ఎమ్యేల్యేలపై అనర్హతే(MLA Disqualification) లక్ష్యంగా మంతనాలు జరుపుతున్నారు. గతంలో సుప్రీంకోర్టు(supreme court) ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో బీఆర్‌ఎస్ నేతలున్నారు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో(TS High court) ఎమ్మెల్యేల అనర్హత వేటుపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే హైకోర్టులో గట్టి వాదనలు వినిపిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు వాదనలను గట్టిగా వినిపించారు. హైకోర్టులో ఆలస్యమైతే వెంటనే సుప్రీంకోర్టు తలుపుతట్టాలని బీఆర్‌ఎస్ చూస్తోంది. ఆ దిశగా న్యాయవాదులతో కసరత్తులు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలోనే ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పక(By elections) వస్తాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామని అన్నారు. ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులపై సుద్దపూస ముచ్చట్లు చెపతున్న కాంగ్రెస్(congress) తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెప్తామన్నారు.