తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై(Revanth reddy) బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సెటైర్లు విసిరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై(Revanth reddy) బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సెటైర్లు విసిరారు. కంప్యూటర్లను కనిపెట్టడం, మళ్లీ వాటిని ఆవిష్కరించడంలో రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నారని కేటీఆర్ వ్యంగంగా అన్నారు. దాంతో పాటుగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి విమానాలు ఎక్కే పనిలో నిమగ్నమై ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రిగా తన విధులను విస్మరిస్తున్నారనే విషయాన్ని ఎవరైనా ఆ పాలమూరు బిడ్డకు గుర్తు చేస్తే బాగుంటుందని కేటీఆర్ చెప్పారు. 'ఇటీవల వచ్చిన వరదలకు(floods) పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులోని వట్టెం పంపు హౌస్ నీట మునిగింది. అయితే ఇప్పటి వరకు సీఎం స్పందించలేదు. వరద నీటికి బాహుబలి మోటార్లు నీట మునిగాయి. ఇప్పటి వరకు కేవలం ఒక మీటర్ నీటిని మాత్రమే తొలగించారు. మరో 18 మీటర్ల నీటిని అలానే ఉంచారు. ఆ నీటిని కూడా త్వరగా తొలగించాలి. తెలంగాణకు ముఖ్యమైన, రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులను ఎందుకు ధ్వంసం చేస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి' అని కేటీఆర్ డిమాండ్ చేశారు.