బీఆర్ఎస్(BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్‌కు(KTR) తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రం ఆర్మూర్(Armur) నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్న‌ బీఆర్ఎస్‌ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది..

బీఆర్ఎస్(BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్‌కు(KTR) తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రం ఆర్మూర్(Armur) నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్న‌ బీఆర్ఎస్‌ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది.. ప్ర‌చార ర‌థం న‌డుపుతున్న డ్రైవ‌ర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో ప్రచారరథం రెయిలింగ్‌ గ్రిల్(Railing Grill) విరిగింది. దీంతొ రెయిలింగ్‌ను పట్టుకుని ఉన్న‌ కేటీఆర్ పాటు ప‌లువురు నాయ‌కులు ఒక్క‌సారిగా కుప్ప‌కూలారు. మంత్రి కేటీఆర్‌ను కిందపడకుండా భద్రతా సిబ్బంది కాపాడింది. ఎంపీ సురేష్‌రెడ్డి(Suresh Reddy), ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి(Jevan Reddy) రోడ్డుపై పడిపోగా స్వల్ప గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

కేటీఆర్ ఆర్మూర్ ప్ర‌చార ర‌థం ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఆయ‌న సోద‌రి, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ క‌విత ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో మాట్లాడాను. వీడియో చూడ‌టానికి భయానకంగా ఉంది. అయితే.. ఆయ‌న‌ నాకు, ప్ర‌జ‌లంద‌రికీ క్షేమంగా ఉన్నాడని హామీ ఇచ్చారు. ఎప్పటిలాగే ఎనర్జిటిక్‌గా ప్రచారాన్ని కొనసాగించడానికి సిద్ధ‌మ‌వుతున్నాం. టేక్ కేర్ రామన్నా.. బీఆర్ఎస్‌ను గెలిపిద్దాం..! అని ట్వీట్ చేశారు.

Updated On 9 Nov 2023 5:52 AM GMT
Ehatv

Ehatv

Next Story