కవిత(Kavitha) బెయిల్‌పై(Bail) కేటీఆర్(KTR) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
కవిత(Kavitha) బెయిల్‌పై(Bail) కేటీఆర్(KTR) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అదే సందర్భంగా ఆవేదన చెందారు కూడా. కవిత బెయిల్ ప్రాసెసింగ్ జరుగుతోందని, వచ్చే వారం కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ కీలక విషయాలు వెల్లడించారు. అదే సమయంలో కవితకు ఆరోగ్యం బాగాలేదని, ఇప్పటికే 11కిలోల బరువు తగ్గారని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో కవితకు అనారోగ్యం రావడంతో కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించి అనుమతి తీసుకొని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించారు. ఆ సమయంలోనే కవిత 9 కిలోల బరువు తగ్గిందనే వార్తలు వచ్చాయి. మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు ఐదు నెలలుగా ఆమె అండర్ ట్రయల్ ఖైదీగా ఉంటున్నారు. గత వారం కవిత బెయిల్ కోసం కేటీఆర్, హరీష్‌రావు న్యాయవాదులను సంప్రదించి గట్టి ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కవితకు వచ్చే వారం బెయిల్ వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.