మూసీ పునరుజ్జీవం(Musi River Revival) పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM revanth reddy) చిత్ర విచిత్ర ప్రకటనలు చేస్తున్నారని కేటీఆర్(KTR) విమర్శించారు.
మూసీ పునరుజ్జీవం(Musi River Revival) పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM revanth reddy) చిత్ర విచిత్ర ప్రకటనలు చేస్తున్నారని కేటీఆర్(KTR) విమర్శించారు. వికారాబాద్ దగ్గర నేవీ రాడార్(Navy radar) పెట్టి లక్షల చెట్లు నరికి వేస్తూ వనమేధం చేస్తున్నారని.. హైదరాబాద్‌లో ఇళ్లు కూలగొడుతూ గృహమేధం చేస్తున్నారని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణ, ప్రక్షాళన కార్యక్రమాల మా హయాంలోనే 16 వేల కోట్లతో డిజైన్లు రూపొందింమచామని కొంత వరకు వాటి పనులు కూడా చేశామన్నారు. 3 వేల కోట్లతో 31 ఎస్టీపీలు పెట్టామని.. అవి పూర్తయితే మూసిలోకి ట్రీటెడ్ వాటర్ వస్తుందని, నల్గొండ జిల్లా రైతాంగానికి స్వచ్ఛమైన నీరు వస్తుందని కేటీఆర్ అన్నారు. రూ.1100 కోట్లతో కొండపోచమ్మసాగర్ నుంచి నీటిని తెచ్చి మూసీలో కల్పలాని కేబినెట్ కూడా ఆమోదించిందని అన్నారు. 31 సీవరేట్ ట్రీట్మెంట్లు పూర్తి చేసి, కొండపోచమ్మసాగర్ నుంచి గోదావరి నీటిని తెచ్చి పోస్తే నల్గొండ జిల్లాకు స్వచ్ఛమైన నీరు అందుతుందని.. ఈ విషయం నల్గొండ జిల్లా మంత్రులు, నేతలు తెలుసుకోవాలన్నారు. మూసీ పునరుజ్జీవానికి బీఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకం కాదని.. అలా అని చెప్పి పేదల ఇళ్లు కొల్లగొడతామంటే అడ్డుకుంటామన్నారు. రీజువనేషన్ అంటూ గొప్పలు చెప్పుకున్నారు. రీజువనేషన్ స్పెల్లింగ్ చూడకుండా రేవంత్‌రెడ్డి రాస్తే 50 లక్షల బ్యాగ్ గిఫ్ట్‌గా ఇస్తానని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.