BRS Election Campaign : ఎన్నికల సమరాంగణంలో కేసీఆర్, వరుస బహిరంగసభలు
బీఆర్‌ఎస్(BRS) అధినాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కదనరంగాన దూకుతున్నారు. పార్టీలో జోష్‌ను నింపుతూ వరుస బహిరంగసభలలో(Public Meetings) పాల్గొనబోతున్నారు.
బీఆర్‌ఎస్(BRS) అధినాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కదనరంగాన దూకుతున్నారు. పార్టీలో జోష్‌ను నింపుతూ వరుస బహిరంగసభలలో(Public Meetings) పాల్గొనబోతున్నారు. ఈ నెల 15న తెలంగాణ భవన్‌లో(Telangana Bhavan) ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులతో సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం వారికి బీ ఫారాలను అందచేస్తారు. పార్టీ మేనిఫెస్టోను(Manifesto) కూడా విడుదల చేస్తారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు తదితర అంశాలపై అభ్యర్థులకు అధ్యక్షుడు కేసీఆర్ గారు వివరిస్తారు. తగు సూచనలు ఇస్తారు.
తర్వాత హైద్రాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. మరుసటి రోజున జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాలలో నిర్వహించే బహిరంగసభలలో పాల్గొంటారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలలో ఏర్పాటు చేసే బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. అక్టోబర్ 18వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో, అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో సిఎం పాల్గొంటారు.
నవంబర్ 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్ లో సిఎం కేసీఆర్ మొదటి నామినేషన్ వేస్తారు.ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ వేస్తారు. అటు పిమ్మట మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.