బీఆర్‌ఎస్(BRS) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు(KCR) కార్యరంగంలోకి దిగారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకోవడమే లక్ష్యంగా చేసుకున్న కేసీఆర్ బుధవారం నుంచి తెలంగాణలో బస్సు యాత్ర(TS Bus Yatra) చేపట్టబోతున్నారు. ఈ పర్యటనలో ఆయన కేవలం రోడ్‌షోలకే(Road Show) పరిమితం కాకుండా, ఎక్కడికక్కడ ప్రజలతో మమేకం కావాలనుకుంటున్నారు.
బీఆర్‌ఎస్(BRS) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు(KCR) కార్యరంగంలోకి దిగారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకోవడమే లక్ష్యంగా చేసుకున్న కేసీఆర్ బుధవారం నుంచి తెలంగాణలో బస్సు యాత్ర(TS Bus Yatra) చేపట్టబోతున్నారు. ఈ పర్యటనలో ఆయన కేవలం రోడ్‌షోలకే(Road Show) పరిమితం కాకుండా, ఎక్కడికక్కడ ప్రజలతో మమేకం కావాలనుకుంటున్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్(BRS) పాలనలో చేసిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు కేసీఆర్. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన తీరును ఎండగట్టబోతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నాటి వాతావరణాన్ని తలపిస్తూ ఉద్వేగాన్ని తట్టిలేపేలా బస్సు యాత్రను సాగించబోతున్నారు కేసీఆర్. గత పదేళ్లలో కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టేలా కేసీఆర్ ప్రసంగాలు ఉండబోతున్నాయట! ఎన్నికల నేపథ్యంలో 17 రోజుల పాటు కేసీఆర్ పూర్తిగా క్షేత్ర స్థాయిలోనే ఉండబోతున్నారు. పర్యటనలో భాగంగా సాయంత్రం సమయాల్లో రోడ్ షోల ద్వారా లోక్‌సభ అభ్యర్థులకు మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేస్తారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉదయం 11 గంటల లోపు స్థానికంగా రైతులు, మహిళలు, యువత, దళితులు, గిరిజనులు, మైనారిటీలు తదితర సామాజికవర్గాలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఈ నెల 24వ తేదీన తెలంగాణభవన్ నుంచి కేసీఆర్ ప్రత్యేక బస్సులో మిర్యాలగూడకు బయలుదేరుతారు. యాత్ర పొడవునా ఆయన వెంట సుమారు వంద వాహనాలతో కూడిన కాన్వాయ్ ఉంటుంది. కేసీఆర్ బస్సు యాత్ర వెంట పార్టీ యువత, విద్యార్థి విభాగాల నాయకులు అనుసరిస్తారు.