తెలంగాణ అసెంబ్లీలో(TS assembly) సోమవారం కూడా హాట్‌హాట్‌గానే చర్చలు సాగాయి.
తెలంగాణ అసెంబ్లీలో(TS assembly) సోమవారం కూడా హాట్‌హాట్‌గానే చర్చలు సాగాయి. అయిదో రోజు సమావేశాలలో పదేళ్ల విద్యుత్(Electricity) శాఖపైనే చర్చ జరిగింది. ఈ క్రమంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Jagadish reddy), మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy venkat reddy) మధ్య మాటల యుద్ధం సాగింది. ఉమ్మడి నల్గొండ(Nalgonda) జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతలు నువ్వెంతంటే నువ్వెంత అని అనుకున్నారు. జగదీశ్‌రెడ్డికి నల్లగొండ జిల్లాలో నేర చరిత్ర ఉందని, ఓ హత్య కేసులో 16 ఏళ్ల పాటు కోర్టు చుట్టూ తిరిగారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. దీనికి జగదీశ్‌రెడ్డి ఘాటుగానే స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపించాలని, లేని పక్షంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలని జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. మూడు కేసుల్లోనూ కోర్టులు విచారణ జరిపి నిర్దోషిగా విడుదల చేశాయని బదులిచ్చారు. నేర చరిత్ర చూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాననిసవాల్ విసిరారు జగదీశ్‌రెడ్డి . కేసీఆర్ నిజంగా సత్య హరిశ్చంద్రుడని, సంచులు మోసే చంద్రుడు కాదని సీఎం రేవంత్ రెడ్డిని(CM revanth reddy) ఉద్దేశించి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిల మధ్య మాటల యుద్ధం ముదిరింది. కోమటిరెడ్డి వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని జగదీశ్ రెడ్డి స్పీకర్‌ను కోరారు.