తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(TSAssembly Elections) తర్వాత బీఆర్‌ఎస్(BRS) పార్టీ మేథోమథనం చేసుకుంటోంది. ప్రజలు ఎందుకు తిరస్కరించారో బేరీజు వేసుకుంటోంది. చేసిన తప్పులేమిటో లెక్కలేసుకుంటోంది. దూకుడుగా వెళుతున్న కాంగ్రెస్‌కు(congress) అడ్డుకట్ట వేసేందుకు వ్యూహాలు రచించుకుంటోంది. మరో నాలుగు నెలలలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో(Lok sabha election) అద్భుతమైన విజయాన్ని సాధించి పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలనే ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పట్నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ప్రజావ్యతిరేకత ఉన్న ఎమ్మల్యేలను మార్చకుండా వారికే తిరిగి టికెట్లు ఇచ్చింది బీఆర్‌ఎస్. ఫలితంగా భారీ మూల్యాన్ని చెల్లించుకుంది.

పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఆ తప్పును లోక్‌సభ ఎన్నికల్లో చేయకూడదనే నిర్ణయానికి వచ్చింది. గెలిచే అభ్యర్థులకే ఎంపీ టికెట్లు ఇవ్వాలనుకుంటోంది. గెలుపు గుర్రాల అన్వేషణలో పడింది. నిజామాబాద్ లోకసభ స్థానం నుంచి నిన్నామొన్నటి వరకు కల్వకుంట్ల కవిత(MLC Kavitha ) పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే తాజా సమాచారం మేరకు ఎన్నికల్లో పోటీకి కవిత దూరంగా ఉంటున్నారట! నిజామాబాద్ టికెట్ సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తూ వస్తున్నవారికి ఇవ్వాలని బీఆర్‌ఎస్ అధినాయకత్వం అనుకుంటోంది. ఇదే విషయాన్ని కవితకు కూడా చెప్పేసింది. కవితకు టికెట్ ఇవ్వకపోవడానికి మరో కారణం ఉంది.
తమది కుటుంబపార్టీ అని వస్తున్న విమర్శలకు అడ్డుకట్ట వేయవచ్చు. అదే సమయంలో పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్నవారిని గుర్తించారన్న పేరూ వస్తుంది. మూడేళ్లుగా కవిత నిజామాబాద్‌లో(Nizamabad) గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు. అనేక కార్యక్రమాలను నిర్వహించారు. బీఆర్‌ఎస్ శ్రేణులతో తరచూ సమావేశాలు జరిపి ఫీడ్‌బ్యాక్ తెలుసుకుంటున్నారు. నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటినీ చుట్టేస్తున్నారు. కార్తకర్తలతో మమేకమవుతున్నారు. కవిత పోటీ చేయడం ఖాయమనుకున్న సమయంలో పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే కవిత పోటీలోంచి తప్పుకోవడమే బెటరనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున పరాజయం చెందితే అధికారపక్షానికి ఆసరా ఇచ్చినట్టు అవుతుందని భావిస్తున్నారు.