ఆర్‌టీవీ(RTV) రవిప్రకాశ్‌(Ravi Prakash) బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS) బీజేపీలో(BJP) విలీనం కానుందని బిగ్ బ్రేగింగ్‌ అంటూ ఓ వార్తను RTVలో ప్రసారం చేశారు.

ఆర్‌టీవీ(RTV) రవిప్రకాశ్‌(Ravi Prakash) బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS) బీజేపీలో(BJP) విలీనం కానుందని బిగ్ బ్రేగింగ్‌ అంటూ ఓ వార్తను RTVలో ప్రసారం చేశారు. మంగళవారం రాత్రి ఆయన ఈ వార్తను బ్రేక్‌ చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా తెలంగాణలో దీనిపైనే చర్చ జరుగుతోంది. రాజకీయాల మీద ఆసక్తి, అభిరుచి వున్నవారంతా దీనిపైనే మాట్లాడుకుంటున్నారు. రవిప్రకాశ్‌ ఈ న్యూస్‌ను బ్రేక్‌ చేసి 12 గంటలకు పైనే అవుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం నుంచి ఒక్క మాట కూడా రాలేదు. సోషల్‌ మీడియాలో(social media), బయట బీఆర్ఎస్‌ కార్యకర్తలు రవిప్రకాష్‌ను ట్రోల్ చేస్తున్నారు. రేవంత్ అమెరికా పర్యటనలో ఫ్రాడ్‌ కంపెనీలతో ఒప్పందాలను బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా(Social media) బయటపెడుతుందన్న కారణంగా అటెన్షన్‌ డైవర్షన్‌ కోసం రేవంత్, రవిప్రకాష్ కలిసి ఈ వార్తను వండిపెట్టారని మండిపడతున్నారు. కానీ వారిలో కూడా చిన్న ఆందోళన అయితే మొదలైంది. కేటీఆర్, హరీష్‌రావు ఇతర బీఆర్‌ఎస్ నేతలు ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. కవిత బెయిల్‌ కోసం ఏకంగా పార్టీని విలీనం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ కార్యకర్తలు సోషల్‌ మీడియా వేదికగా, అటు బహిరంగంగా పార్టీ అధిష్టానం స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీపై(Praja rajyam) 'జెండా పీకేద్దాం' అన్న పెద్ద హెడ్డింగ్‌తో వార్త రాస్తే ఆ పార్టీ అధినేత చిరంజీవి(Chiranjeevi) వెళ్లి ఈనాడు ఆఫీస్‌(Enadu Office) ఎదురుగా ధర్నా కూడా చేశారు. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కానీ ఇంత పెద్ద వార్తను రవిప్రకాష్ వండివార్చితే బీఆర్‌ఎస్ ఎందుకు మౌనంగా ఉందని కార్యకర్తలు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ వార్త నిజం కాకుంటే ఎందుకు స్పందించడం లేదని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. గతంలో కేటీఆర్‌, కేసీఆర్‌ ఎన్నో సార్లు ఇలాంటి వార్తలను ఖండించినా మళ్లీ పదే పదే అవే వార్తలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ మౌనం వీడుతుందా.. విలీనం దిశగా అడుగులు వేస్తుందా అనే ప్రశ్నలకు అధిష్టానమే స్పందిస్తే కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు.

Eha Tv

Eha Tv

Next Story