బీఆర్‌ఎస్‌పై(BRS) శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి(Gutta Sukender Reddy) నేరుగా విమర్శలు చేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌పై(BRS) శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి(Gutta Sukender Reddy) నేరుగా విమర్శలు చేస్తున్నారు. మూసీ(Musi) ప్రక్షాళనపై ఆయన బీఆర్‌ఎస్ వైఖరిని తప్పుబట్టారు. మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్, బీజేపీ తీరును శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ స్వాగతిస్తున్నా. వాజ్‌పేయి ప్రభుత్వం హయాంలోనే నదుల ప్రక్షాళనకు అడుగు పడింది. కేసీఆర్(KCR) కూడా రివర్ ఫ్రంట్ పేరుతో ప్రణాళిక తీసుకొచ్చారు. గత ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితం అయ్యాయి. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల కోసం నందనవనంలో గతం లోనే వేయికి పైగా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏదో చేస్తున్నట్టు వ్యతిరేక ప్రచారం చేయడం కరెక్ట్ కాదని గుత్తా అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని.. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని.. అన్నింటికీ రాజకీయ కోణం లో విమర్శించడం సమంజసం కాదని గుత్తా అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ప్రతిపక్షాల తీరును ఎండగట్టాలని.. అవసరమైతే మూసీ ప్రక్షాళన కోసం ఉద్యమానికి చేయాలని పిలుపునిచ్చారు గుత్తా. అయితే గుత్తా వ్యాఖ్యలను బట్టి ఇక ఆయన కూడా కాంగ్రెస్‌లో అధికారికంగా చేరినట్లేనని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు.
