రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) సోమవారం అభ్యర్ధులను ప్రకటించారు. కేవలం కొద్ది మార్పులతో కేసీఆర్ జాబితా ప్రకటించారు. 7 స్థానాలలో మాత్రమే మార్పులు చేశారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) సోమవారం అభ్యర్ధులను ప్రకటించారు. కేవలం కొద్ది మార్పులతో కేసీఆర్ జాబితా ప్రకటించారు. 7 స్థానాలలో మాత్రమే మార్పులు చేశారు. మరో నాలుగు.. నర్సాపూర్(Narsapur), జనగామ(Janagaon), నాంపల్లి(Nampalli), గోశామహల్(Goshamahal) సీట్లు పెండింగ్ ఉన్నాయని.. రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. అయితే.. గ్రేటర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ఆరుగురు అభ్యర్థులు వరుసగా అదేస్థానం నుంచి ఇప్పటికే రెండుసార్లు గెలిచారు. మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టేందుకు బరిలో నిలుస్తున్నారు.
సనత్‌నగర్(Sanath Nagar) నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav), సికింద్రాబాద్(Secundrabad) నుంచి పద్మారావు(Padmarao), జూబ్లీహిల్స్(Jubilee Hills) నుంచి మాగంటి గోపీనాథ్(Maganti Gopinath), రాజేంద్రనగర్(Rajendra Nagar) నుంచి ప్రకాశ్‌గౌడ్(Prakash Goud), శేరిలింగంపల్లి(Sherilingampalli) నుంచి అరికెపూడి గాంధీ(Arikepudi Gandhi), కూకట్‌పల్లి(Kukatpalli) నుంచి మాధవరం కృష్ణారావు(Madhavaram Krishnarao), కుత్బుల్లాపూర్(Quthbullapur) నుంచి వివేకానంద్(Vivekanandh) వరుసగా అవే స్థానాల నుంచి రెండు సార్లు విజయం సాధించారు. అధినేత కేసీఆర్ విడుదల చేసిన జాబితాలో మరోమారు ఆ స్థానాల నుంచి వారికే టికెట్లు దక్కాయి. దీంతో మారోమారు గెలిచి హ్యాట్రిక్(Hattrick) కొట్టాలని నేతలు తహతహలాడుతున్నారు.