Khammam Results : మళ్లీ ఆ ఒక్కటే...!
తెలంగాణలో(Telangana) ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాకో ప్రత్యేకత ఉంది. తెలంగాణ తొలి ఉద్యమం మొదలయ్యింది ఇక్కడే. మలి ఉద్యమాన్ని ఉత్తేజపరచింది కూడా ఈ జిల్లానే! తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా ఎందుకో బీఆర్‌ఎస్‌కు(BRS) బలం కానీ బలగం కానీ లేవు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో అప్పటి టీఆర్‌ఎస్‌కు ఈ జిల్లా ప్రజలు ఒకే ఒక్క సీటునిచ్చి సర్దుకుపోమన్నారు.
తెలంగాణలో(Telangana) ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాకో ప్రత్యేకత ఉంది. తెలంగాణ తొలి ఉద్యమం మొదలయ్యింది ఇక్కడే. మలి ఉద్యమాన్ని ఉత్తేజపరచింది కూడా ఈ జిల్లానే! తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా ఎందుకో బీఆర్‌ఎస్‌కు(BRS) బలం కానీ బలగం కానీ లేవు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో అప్పటి టీఆర్‌ఎస్‌కు ఈ జిల్లా ప్రజలు ఒకే ఒక్క సీటునిచ్చి సర్దుకుపోమన్నారు. 2014 ఎన్నికల్లో కొత్తగూడెం(Kothagundem) నుంచి పోటీ చేసిన జలగం వెంకటరావు(Jalagam Venkat Rao) గెలుపొందారు. అలాగే 2018లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్(Puvvada Ajay Kumar) విజయం సాధించారు. ఆ జిల్లా నుంచి పోటీ చేసిన మిగతా బీఆర్‌ఎస్ అభ్యర్థులంతా ఓటమి చెందారు. మళ్లీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌కు ఓకే ఒక సీటును ఇచ్చారు జిల్లా ప్రజలు. భద్రాచలం(Bhadrachalam) నుంచి పోటీ చేసిన తెల్లం వెంకట్రావు గెలుపొందారు కానీ మిగతావారందరికీ పరాజయాలే ఎదురయ్యాయి. అంటే ఖమ్మం ప్రజలు బీఆర్‌ఎస్‌ను పెద్దగా ఆదరించడం లేదని అర్థమవుతోంది. అప్పుడు ఇప్పుడు ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్కటే సీటిచ్చి సంతృప్తిపడమని అంటున్నారు.