సుమతీకారుడు చెప్పినట్టు తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరతాయి! బెల్లం చుట్టూ ఈగలు ముసురుతాయి. అధికారపక్షం ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పట్నుంచి కొందరు బీఆర్‌ఎస్(BRS) నేతలకు వశపడతలేదు. ఎప్పుడెప్పుడు అధికారపక్షంలోకి దూకుదామా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ కండువా వేసుకున్నారు.
సుమతీకారుడు చెప్పినట్టు తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరతాయి! బెల్లం చుట్టూ ఈగలు ముసురుతాయి. అధికారపక్షం ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పట్నుంచి కొందరు బీఆర్‌ఎస్(BRS) నేతలకు వశపడతలేదు. ఎప్పుడెప్పుడు అధికారపక్షంలోకి దూకుదామా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికలు(Lok sabha Elections) దగ్గరపడుతున్నాయి కాబట్టి మరికొందరు జంప్‌కు రెడీ అవుతున్నారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి(Shekar reddy) కూడా బీఆర్‌ఎస్ గూటిని ఖాళీ చేసి కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారని వినికిడి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శేఖర్‌రెడ్డి భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 2014,2018 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన ఫైళ్ల 2023లో మాత్రం ఓడిపోయారు. పదవి పోయి వందరోజులైనా కాలేదు అప్పుడే పార్టీ మారే అలోచన చేస్తున్నారు శేఖర్‌రెడ్డి. ఇప్పటి వరకు భువనగిరి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు. గుత్తా సుఖేందర్‌రెడ్డి కొడుకు గుత్తా అమిత్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని, భువనగిరి లోక్‌సభ టికెట్ అతడికి కన్ఫార్మ్ అయ్యిందని వార్తలు వచ్చాయి. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు, సీఎం రేవంత్ సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డితో అమిత్ భేటీ అయ్యారు. అయితే కోమటి రెడ్డి కుటుంబంతో గుత్తా కుటుంబానికి అస్సలు పడదు. ఈ విభేదాల కారణంగానే గుత్తా అమిత్ రెడ్డికి టికెట్ దొరకడం కష్టమని అంటున్నారు. పైళ్ల శేఖర్‌రెడ్డిని తెరపైకి తీసుకొచ్చింది అందుకేనట! అంగబలం, అర్ధబలం శేఖర్‌రెడ్డికి ఉన్నాయి కాబట్టి ఆయనను పార్టీలో చేర్చుకుని టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోందని సమాచారం!