బీఆర్ఎస్‌కు(BRS) మాజీమంత్రి షాక్ ఇచ్చారు. ఇటీవల అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా(Assembly Candidate List) ప్రకటించిన తర్వాత.. అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. టికెట్ రాకపోవడంతో ఇతర పార్టీలలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. తాజాగా బీఆర్ఎస్‌కు మాజీ మంత్రి కృష్ణ యాదవ్(Krishna Yadav) రాజీనామా చేశారు.
బీఆర్ఎస్‌కు(BRS) మాజీమంత్రి షాక్ ఇచ్చారు. ఇటీవల అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా(Assembly Candidate List) ప్రకటించిన తర్వాత.. అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. టికెట్ రాకపోవడంతో ఇతర పార్టీలలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. తాజాగా బీఆర్ఎస్‌కు మాజీ మంత్రి కృష్ణ యాదవ్(Krishna Yadav) రాజీనామా చేశారు. ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ జాబితాలో కృష్ణ యాదవ్ పేరు లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
త్వరలో కృష్ణ యాదవ్ బీజేపీలో(BJP) చేరుతారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కృష్ణ యాదవ్ ఆసక్తి చూపిస్తున్నారు. అంబర్ పేట(Amberpet) లేదా మలక్ పేట(Malakpet) నియోజకవర్గాల నుంచి టికెట్ ను ఆశిస్తున్నారు. అయితే.. కేసీఆర్(KCR) బీఆర్ఎస్ నుంచి మలక్ పేట టికెట్ తీగల అజిత్ రెడ్డికి(Thigala Ajith Reddy), అంబర్ పేట టికెట్ కాలేరు వెంకటేశ్ కు ఇచ్చారు. ఈ క్రమంలోనే కృష్ణ యాదవ్ బీజేపీలో చేరి బరిలో నిలవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.