బావుల దగ్గర మీటర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM revanth reddy) రైతులను తప్పుతోవ పట్టిస్తున్నారని విద్యుత్ శాఖ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి(Jagadish reddy) విమర్శించారు.

బావుల దగ్గర మీటర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM revanth reddy) రైతులను తప్పుతోవ పట్టిస్తున్నారని విద్యుత్ శాఖ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డి(Jagadish reddy) విమర్శించారు. అసెంబ్లీలో విద్యుత్ ప‌ద్దుల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా మాట్లాడిన జగదీశ్‌రెడ్డి శాసనసభలో రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడారన్నారు. మొన్న ఇదే అసెంబ్లీలో హ‌రీశ్‌రావు(Harish Rao) మాట్లాడుతూ.. 30 వేల కోట్ల రూపాయల న‌ష్టానికి సిద్ధ‌ప‌డ్డాం కానీ.. బోరు బావుల వ‌ద్ద మీట‌ర్లు పెట్ట‌లేదు అని చెప్పిన విషయాన్ని జగదీశ్‌రెడ్డి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం హరీశ్‌రావు మాట్లాడింది తప్పంటూ కేసీఆర్‌(KCR), మోదీ(Modi) సంతకాలు పెట్టారని చెబుతూ కొలంబ‌స్, వాస్కోడిగామా లాగా ఒక ప‌త్రం ప‌ట్టుకొచ్చారని, కొన్ని ప‌దాలు డిలీట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి చ‌దివారు అని జగదీశ్‌ చెప్పుకొచ్చారు. హ‌రీశ్‌రావు కేవ‌లం ఉద‌య్ ప‌థ‌కం గురించి చెప్పారు. ఈ ప‌థ‌కంలో 27 రాష్ట్రాలు చేరాయి. ఈ ప‌థ‌కం డిస్క‌లం ఆర్థిక ప‌రిస్థితిని స‌రిదిద్ద‌డానికి తీసుకొచ్చారు. ఉద‌య్ ప‌థ‌కంలో తమ కంటే ముందే కాంగ్రెస్(Congress) పాలిత రాష్ట్రాలు చేరాయని, ఆ త‌ర్వాత తాము కూడా చేరామని, సీఎం ప్ర‌జ‌ల‌ను, రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేశారని జగదీశ్‌ రెడ్డి మండిపడ్డారు.

Updated On 29 July 2024 6:43 AM GMT
Eha Tv

Eha Tv

Next Story