ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుగా సొరంగ పనులు ముందుకు కదలక పోవడానికి కారణం నీటి ఊటనే అన్నారు. నీటి ఊటను ఎదుర్కోవడానికి మేం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని..

నీటిని బయటికి పంపించేందుకు నెలకు కోటిన్నర ఖర్చు వచ్చేదన్నారు. తాను విద్యుత్ శాఖా మంత్రిగా ఉన్నాను కాబట్టి పరిస్థితి కళ్ళారా చూశానని ఈ టెక్నాలజీ సరైంది కాదని ఆనాడే చెప్పామన్నారు. నాడు సమైక్యాంద్ర పాలకుల కుట్రల కారణంగానే ఎస్ఎల్బీసీ(SLBC) ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైందన్నారు. టన్నెల్ వద్ద మంత్రుల వ్యవహారం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుపై అవగాహన లేక పరువు తీసుకుంటున్నారని.. ఓ మంత్రి వాటర్‌లో నీళ్లు కలవడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి కమెడియన్ అయ్యాడన్నారు. గోడకు చెవులు పెట్టడం...సొరంగ మార్గంలో ఫోన్ రింగ్ అవుతుందని చెబుతూ వింత వింతగా ప్రవర్తిస్తున్నాడని వ్యంగ్యాస్త్రాలు వేశారు.



Updated On 27 Feb 2025 9:37 AM GMT
ehatv

ehatv

Next Story