మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswar Rao) బీఆర్ఎస్‌కు(BRS) రాజీనామా(Resign) చేశారు. ఈ మేర‌కు త‌న రాజీనామా ప‌త్రాన్ని భార‌త రాష్ట్ర స‌మితి అధ్య‌క్షుడు కేసీఆర్‌కు(KCR) పంపారు. తుమ్మ‌ల రాజీనామా లేఖ‌లో.. తెలంగాణ రాష్ట్ర స‌మితిలో నాకు స‌హ‌క‌రించినందుకు ధ‌న్య‌వాదములు. పార్టీకి నా రాజీనామాను స‌మ‌ర్పిస్తున్నాను అని పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. తుమ్మ‌ల నేడు సోనియా(Soniya Gandhi), రాహుల్(Rahul Gandhi) సమక్షంలో కాంగ్రెస్(Congress) లో చేర‌నున్నారు. నేడు మంచి రోజు కావడంతో తుమ్మల కాంగ్రెస్ కండువా క‌ప్పుకుంటున్న‌ట్లు స‌మాచారం. అయితే.. క్యాడర్ మాత్రం రేపు కాంగ్రెస్‌లో జాయిన్ కానున్న‌ట్లు తెలుస్తోంది. పాలేరు టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ అధిష్టానం మీద అసంతృప్తిగా ఉన్న తుమ్మల కాంగ్రెస్‌లో చేరుతార‌నే ఊహాగానాలు చాల‌కాలంగా విన‌ప‌డుతున్నాయి. ఈన నేప‌థ్యంలోనే ప‌లుమార్లు కాంగ్రెస్ నేత‌లు ఆయ‌న‌ను సంప్ర‌దించారు.

శుక్ర‌వారం కూడా కాంగ్రెస్ ముఖ్యనేతలు తుమ్మ‌లతో భేటీ అయ్యారు. హైటెక్ సిటీ మాదాపూర్ లోని మై హోమ్ భుజాలోని తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లిన నేత‌లు ఆయ‌న‌తో భేటీ అయ్యారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కో.చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు తుమ్మ‌ల నివాసానికి వెళ్లారు. ఈ స‌మావేశంనే తుమ్మ‌ల‌ చేరిక‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు.

Updated On 16 Sep 2023 12:43 AM GMT
Ehatv

Ehatv

Next Story