రెండు వేల రూపాయల నోటును చెలామణి నుంచి ఉపసంహరించుకోవడమన్నది మోదీ ప్రభుత్వం అసంబద్ధమైన, అశాస్త్రీయమైన నిర్ణయమని బీఆర్‌ఎస్(BRS) నాయకుడు దాసోజు శ్రవణ్(Dasoju sravan) విమర్శించారు. దీనిపై అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు.
రెండు వేల రూపాయల నోటును చెలామణి నుంచి ఉపసంహరించుకోవడమన్నది మోదీ ప్రభుత్వం అసంబద్ధమైన, అశాస్త్రీయమైన నిర్ణయమని బీఆర్‌ఎస్(BRS) నాయకుడు దాసోజు శ్రవణ్(Dasoju shravan) విమర్శించారు. దీనిపై అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు. 2016లో నల్లధనాన్ని అరికట్టడం కోసమంటూ నోట్లను రద్దు చేసిన మోదీ(Modi) సర్కార్ ఆ తర్వాత ఎంత బ్లాక్‌మనీ వచ్చిందో చెప్పలేకపోయిందన్నారు. నోట్ల రద్దుతో ఉగ్రవాదం అంతరించిపోతుందని ప్రభుత్వం డాంబికాలు పలికిందని అన్నారు.
నోట్ల రద్దు సృష్టించిన విధ్వంసానికి వంద మందికిపైగా ప్రజలు మరణించారని చెప్పారు. అప్పుడు వెయ్యి రూపాయల నోటును రద్దు చేసి, ఆ స్థానంలో 2000 నోటును ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావడం లేదన్నారు. ఆరున్నరేళ్ల తర్వాత ఇప్పుడు సడన్‌గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవలసి వచ్చిందో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. మనది ప్రజాస్వామ్య దేశమన్న సంగతి మోదీ ప్రభుత్వం మర్చిపోతున్నదని విమర్శించారు. భారతదేశాన్ని మోదీ తన వ్యక్తిగత ఆస్తిగా పరిగణిస్తున్నారని, నియంతృత్వ పోకడలకు పోతున్నారని చెప్పారు. డీమానిటైజేషన్ అన్నది పెద్ద స్కామ్ అని, దీనిపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని దాసోజు శ్రవణ్ అన్నారు.