కాంగ్రెస్ పార్టీ(congress Party) గుట్టుచప్పుడు కాకుండా చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ గులాబీ నేతలు లోనవుతున్నారు. తాము గేట్లు తేరిస్తే బీఆర్‌ఎస్ ఖాళీ అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) కొన్ని రోజుల కిందట చెప్పారు కదా! బహుశా గేట్లు తెరిచినట్టే ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ(congress Party) గుట్టుచప్పుడు కాకుండా చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ గులాబీ నేతలు లోనవుతున్నారు. తాము గేట్లు తేరిస్తే బీఆర్‌ఎస్ ఖాళీ అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) కొన్ని రోజుల కిందట చెప్పారు కదా! బహుశా గేట్లు తెరిచినట్టే ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల వరకు కూడా బీఆర్‌ఎస్(BRS) నేతలు ఆగేట్టుగా లేరు. ఒక్కొక్కరుగా గులాబీ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరుతున్నారు. అబ్బే ఇది శాంపుల్ మాత్రమేనని, లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గంపగుత్తగా తమ పార్టీలోకి వచ్చేస్తారని కాంగ్రెస్ ఢంకా బజాయించి మరీ చెబుతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్(Danam Nagendra) కాంగ్రెస్‌లో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. రేవంత్ పాలన బాగున్నదని, రోజుకో గుడ్ న్యూస్ వింటున్నామని దానం చెప్పినప్పుడే అర్థమయ్యింది ఆయన దుకాణం సర్దేసుకుంటున్నారని! కాంగ్రెస్‌లో చేరుతున్న మొదటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందరే! ఈయన బాటలో మరికొందరు నడిచే అవకాశం ఉంది. దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్ అడిగారట! కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఆలోచిస్తున్నదట! వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్(Pasunuri Dayakar) ఆల్‌రెడీ కాంగ్రెస్‌లో చేరిపోయారు. సోమవారం అధికారికంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారు. దయాకర్‌కు బీఆర్‌ఎస్ మళ్లీ టికెట్ ఇవ్వకపోయే సరికి తన దారి తాను చూసుకుంటున్నారు. వరంగల్ లోక్‌సభ టికెట్‌ను ఆరూరి రమేష్‌కు ఇద్దామనుకుంది బీఆర్‌ఎస్. కానీ ఆయన పోటీకి విముఖత చూపారు. తర్వాత ఆయన బీజేపీలో చేరారు. వరంగల్ టికెట్ కడియం శ్రీహరి కూతురు కావ్యకు ఇవ్వడంతో దయాకర్ మనస్తాపానికి గురయ్యారు. కాంగ్రెస్ గూటికి వెళ్లారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నారట. ఆల్‌రెడీ మాటా ముచ్చట అయ్యిందట! మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా గోడ దూకడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. గోషామహల్ బీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జ్ నందకిశోర్ వ్యాస్ శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. ఈయన కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలిసింది.కొందరు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నారని వినికిడి.