ఎమ్మెల్సీ కవితపై సామాజిక మాధ్యమలలో దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నేత‌లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు

ఎమ్మెల్సీ కవితపై సామాజిక మాధ్యమలలో దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నేత‌లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం మరియు పార్టీ నాయకులు అధికారిక ఖాతాలలో ఎమ్మెల్సీ కవిత ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ అసభ్యకరంగా వ్యాఖ్యలు రాసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె కీర్తి ప్రతిష్టలను భంగం కలిగించే విధంగా పోస్టులను పెడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ విధంగా ఎమ్మెల్సీ కవితపై దుష్ప్రచారం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని.. వారి ఖాతాల‌లోని పోస్టులను తొలగించాలని కోరుతూ సైబర్ క్రైమ్ డిసిపికి బీఆర్ఎస్ నేత‌లు ఫిర్యాదు చేశారు.

లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత రెండు రోజుల క్రితం జైలు నుండి విడుదల‌య్యారు. ఈ నేపథ్యంలోనే కొందరు కవితపై అసభ్యక‌రంగా వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి చెక్కర్లు కొడుతూ ఉండడంతో వెంటనే స్పందించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సైబర్ క్రైమ్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి అటువంటి పోస్టులు పెట్టిన వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని డీసీపీ హామీ ఇచ్చారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story