నిన్నటి వరకు బీఆర్‌ఎస్ సిట్టింగు ఎమ్మెల్యేలు(BRS Sitting MLAs)కాసింత ధీమాగా ఉన్నారు. ఇవాళ కేసీఆర్(KCR) హెచ్చరికతో టెన్షన్‌లో పడిపోయారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లనున్నామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. బాగా పని చేసిన వారికే టికెట్లు ఇస్తామని పేర్కొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేయాలని, మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టమని హెచ్చరించారు.
నిన్నటి వరకు బీఆర్‌ఎస్ సిట్టింగు ఎమ్మెల్యేలు(BRS Sitting MLAs)కాసింత ధీమాగా ఉన్నారు. ఇవాళ కేసీఆర్(KCR) హెచ్చరికతో టెన్షన్‌లో పడిపోయారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లనున్నామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. బాగా పని చేసిన వారికే టికెట్లు ఇస్తామని పేర్కొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేయాలని, మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీకే నష్టమని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ ఈ మాటన్నారు. దప్పిక వేసినప్పుడే బావి తవ్వుతామంటే కుదరదని, ప్రజా ప్రతినిధులు ప్రతిరోజూ ప్రజలలో ఉండే విధంగా కార్యాచరణ చేపట్టాలని కేసీఆర్ తెలిపారు. నియోజకవర్గాల వారీగా ఇద్దరు ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట జడ్పీ ఛైర్‌పర్సన్‌లు, ఎంపీలు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించాలని కేసీఆర్ అన్నారు. మూడు నాలుగు నెలలలో ఇన్‌ఛార్జ్‌ల నియామక ప్రక్రియ పూర్తి కావాలన్నారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవ్వాలని అన్నారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు రావడమే మనకు ప్రధానమన్నారు. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్‌ను కూడా నడపవచ్చని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ పలు తీర్మానాలను చర్చించి, ఆమోదించింది. మొదటిది ప్రతి రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం. రెండోది దేశ వ్యాప్తంగా 24 గంటల విద్యుత్ సరఫరా. మూడవది విదేశాలకు దేశీయ ఆహారోత్పత్తుల ఎగుమతి. నాలుగోది దేశ వ్యాప్తంగా దళిత బంధు అమలు. అయిదోది దేశంలో బీసీ జనగణన జరపాలి.