విధానాలకు వ్యతిరేకంగా గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న “రైతు వ్యతిరేక” విధానాలకు వ్యతిరేకంగా గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పిలుపునిచ్చింది. కాంగ్రెస్ మరోసారి రైతులకు ద్రోహం చేసిందని ఆరోపిస్తూ అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పుడు నాణ్యమైన వరికి మాత్రమే బోనస్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారని కేసీఆర్ అన్నారు. ఇది ముమ్మాటికీ రైతులను ద్రోహం చేయడమేనని అన్నారు.
ఎన్నికల సమయంలో క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మాత్రం సన్న వడ్లకు మాత్రమే ఇస్తానని చెప్పడం వంచించడమేనని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారనే విషయం అందరికీ తెలిసిందేనని.. ఈ విషయం ప్రభుత్వానికి తెలిసి కూడా దొడ్డు వడ్లు పండిస్తే బోనస్ ఇవ్వబోమని ఎలా చెబుతుందని ప్రశ్నించారు. వరి వేసిన వారందరికీ రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఈ ప్రకటన చేసి ఉంటే రైతులు కాంగ్రెస్ కు సరైన గుణపాఠం చెప్పేవారన్నారు.