బీఆర్ఎస్ పార్టీ బోధ‌న్‌ మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ అహ్మ‌ద్‌ కుమారుడు ర‌హేల్‌

బీఆర్ఎస్ పార్టీ బోధ‌న్‌ మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ అహ్మ‌ద్‌ కుమారుడు ర‌హేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ర‌హేల్‌ను సోమ‌వారం విమానాశ్ర‌యంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌జా భ‌వ‌న్ వ‌ద్ద కారు ప్ర‌మాదంలో ర‌హేల్ నిందితుడిగా ఉన్నాడు. ప్ర‌మాదం జరిగిన త‌ర్వాత ర‌హేల్ దుబాయ్‌కు పారిపోయాడు. ఈ ప్ర‌మాదం త‌ర్వాత ర‌హేల్‌కు బ‌దులుగా మరొక‌రిని డ్రైవ‌ర్‌గా చేర్చి ర‌హేల్ పారిపోయాడు. పోలీసులు ర‌హేల్‌పై వివిధ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసి, అత‌ని కోసం లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. ర‌హేల్ దుబాయ్ నుంచి హైద‌రాబాద్‌కు తిరిగి రాగా, పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే ష‌కీల్‌ను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. సాక్ష్యాల‌ను తారుమారు చేసిన ఆరోప‌ణ‌ల‌పై పోలీసులు అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే.

ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కేసులో రహెల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత షకీల్ తనయుడు దుబాయ్‌కు పారిపోయాడని తెలియడంతో పోలీసులు రహెల్ భారత్ కు వచ్చే వరకూ ఎదురుచూశారు.

Updated On 7 April 2024 10:40 PM GMT
Yagnik

Yagnik

Next Story