ఎన్నికలు(Elections) ముంచుకొస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచార ఉధృతిని పెంచాయి. ఒకప్పటిలా ఇప్పుడు గోడమీద రాతలు లేవు. కరపత్రాలు(Pamplets), పోస్టర్లు, ప్రచార రథాలతో ఎలక్షన్‌ క్యాంపెయిన్‌(Election Campaign) చేస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు ప్రధాన వార్త పత్రికల్లో, ఎలక్ట్రానిక్‌ మీడియాలలో(Electronic media) కూడా ప్రకటనలు ఇస్తున్నాయి. అయితే సాధారణ పౌరుడు మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ప్రస్తుత జమానా సోషల్ మీడియాది(Social media)! ఇప్పుడు చాలా మంది చేతుల్లో సెల్‌ఫోన్‌ ఉంది. లేచినకాడినుంచి పడుకునేవరకు ఫోన్‌లను వదిలిపెట్టనివారి సంఖ్య కూడా ఎక్కువే! వీరంతా సోషల్ మీడియాలో వచ్చే వార్తలనే చూస్తారు తప్పితే ప్రధాన మీడియాపై పెద్దగా ఫోకస్‌ పెట్టరు. అందుకే పార్టీలు తమ స్థాయికి తగినట్టుగా డబ్బులు ఖర్చు పెట్టి సోషల్‌ మీడియా టీమ్‌ను పోషిస్తున్నాయి.

ఎన్నికలు(Elections) ముంచుకొస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచార ఉధృతిని పెంచాయి. ఒకప్పటిలా ఇప్పుడు గోడమీద రాతలు లేవు. కరపత్రాలు(Pamplets), పోస్టర్లు, ప్రచార రథాలతో ఎలక్షన్‌ క్యాంపెయిన్‌(Election Campaign) చేస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు ప్రధాన వార్త పత్రికల్లో, ఎలక్ట్రానిక్‌ మీడియాలలో(Electronic media) కూడా ప్రకటనలు ఇస్తున్నాయి. అయితే సాధారణ పౌరుడు మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ప్రస్తుత జమానా సోషల్ మీడియాది(Social media)! ఇప్పుడు చాలా మంది చేతుల్లో సెల్‌ఫోన్‌ ఉంది. లేచినకాడినుంచి పడుకునేవరకు ఫోన్‌లను వదిలిపెట్టనివారి సంఖ్య కూడా ఎక్కువే! వీరంతా సోషల్ మీడియాలో వచ్చే వార్తలనే చూస్తారు తప్పితే ప్రధాన మీడియాపై పెద్దగా ఫోకస్‌ పెట్టరు. అందుకే పార్టీలు తమ స్థాయికి తగినట్టుగా డబ్బులు ఖర్చు పెట్టి సోషల్‌ మీడియా టీమ్‌ను పోషిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌(BRS), బీజేపీ(BJP), కాంగ్రెస్‌లు(Congress) సోషల్‌ మీడియాకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారం తీరే మారిపోయింది. ఇప్పటికే సోషల్‌ మీడియాను పార్టీలు హోరెత్తిస్తున్నాయి. వాట్సప్‌ ద్వారా తమ ఘనతలను క్షేత్రస్థాయికి తీసుకెళుతున్నాయి. ట్విట్టర్‌(Twitter), ఫేస్‌బుక్‌(Facevbook), ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) .. ఇలా ఏది దేన్ని వదలడం లేదు. ఈ పన్నెండు రోజుల పాటు సోషల్‌ మీడియాలో ఎన్నికల ప్రచారం తప్పితే మరోటి కనిపించదంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రత్యేకంగా రాయించుకుని, ట్యూన్‌ చేయించుకున్న పాటలతో ప్రజల చెంతకు వెళుతున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ పాట గులాబీల జెండలమ్మా విపరీతమైన క్రేజ్‌ను సంపాదించింది. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తుంది. ఈ పాటను అనుకరిస్తూ ప్రత్యర్థి పార్టీలు కూడా కౌంటర్‌ పాటలను రూపొందించుకున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ పాట మా తాత కాంగ్రెస్‌, ముత్తాత కాంగ్రెస్‌, బీజేపీ పాట తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా పాటలు కూడా ఇప్పటికే సోషల్‌ మీడియాలో మార్మోగుతున్నాయి.
సోషల్‌ మీడియా ప్రభావితులకు ఇప్పుడు డిమాండ్‌ పెరిగింది. ఫాలోవర్లు ఎక్కువగా ఉన్నారిని రాజకీయ పార్టీలు గాలమేస్తున్నాయి. వారిని తమ ప్రచారానికి వాడుకుంటున్నాయి. వారు అడిగినంత ఇచ్చుకుంటున్నాయి. మంచి కటెంట్‌తో రీల్స్‌ చేసేవారిని కూడా వదలడం లేదు. లక్షల కొద్ది సబ్‌స్క్రైబర్లు ఉన్న ఖాతాలు, యూట్యూబ్‌ వ్లాగర్లు, బ్లాగర్లను ఎంపిక చేసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. వారి ఖాతాలో ఎలాంటి కంటెంట్‌ ఉండాలో పార్టీలే చెబుతున్నాయి.
అంతా బాగానే ఉంది కానీ, సోషల్‌ మీడియా ప్రచారం రేసులో మాత్రం కాంగ్రెస్‌, బీజేపీలతో పోలిస్తే బీఆర్‌ఎస్‌ కాసింత వెనుకబడిందనే చెప్పుకొవాలి. బీఆర్‌ఎస్‌ సోషల్ మీడియా సైన్యం ఒళ్లు వంచుకుండా పని చేస్తున్నప్పటికీ ప్రత్యర్థులను అందుకోలేకపోతున్నారు. బిత్తిరి సత్తి, శివజ్యోతిలతో ఇప్పుడు కొన్ని సెటైరికల్‌ వీడియోలు చేయిస్తున్నా అది ప్రజల్లోకి వెళ్లేటప్పటికీ కొంచెం టైమ్‌ పడుతుంది. ఆ లోగా ఎన్నికల ప్రహసనం ముగిసినా ముగియవచ్చుమరోవైపు బలగం సినిమా పెద్దాయనతో వస్తున్న ప్రకటనలు సోషల్‌ మీడియాలో సర్క్యూలేట్‌ అవుతున్నా జనాల దృష్టిని పెద్దగా ఆకర్షించలేకపోతున్నాయి. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో గులాబీల జెండలమ్మ పాటను రీల్స్‌గా చేయించగానే, కాంగ్రెస్‌, బీజేపీలు వాటిని తమకు అనుకూలంగా మార్చుకుని పోస్టు చేస్తున్నాయి. దీంతో ప్రజలలో కొంచెం కన్ఫ్యూజన్‌ చోటు చేసుకుంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ వినూత్నమైన కంటెంట్‌తో వీడియోలను రూపొందిస్తున్నది. ఇప్పటి వరకైతే ఫీల్డ్‌లో కాంగ్రెస్‌, బీజేపీల కంటే బీఆర్‌ఎస్‌ ముందున్నప్పటికీ, సోషల్‌ మీడియాలో మాత్రం ప్రత్యర్థులను అధిగమించలేకపోతున్నది. ఈ పన్నెండు రోజుల్లో క్రియేటివిటినీ పెంచి రేసులో ముందుకొస్తుందేమో చూడాలి.

Updated On 18 Nov 2023 1:05 AM GMT
Ehatv

Ehatv

Next Story