ఆదర్శ నగర్(adharsh nagar) ఎమ్మెల్యే క్వార్టర్స్(MLA quarters) లోని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్(Thalasani Srinivas Yadav) నివాసంలో బీఆర్ఎస్ బీసీ ప్రజాప్రతినిధులు(BRS BC Representatives) అత్యవసర భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud), గంగుల కమాలకర్(Gangula Kamalakar), రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోని బీసీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తుందని ఆరోపించారు.
ఆదర్శ నగర్(adharsh nagar) ఎమ్మెల్యే క్వార్టర్స్(MLA quarters) లోని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్(Thalasani Srinivas Yadav) నివాసంలో బీఆర్ఎస్ బీసీ ప్రజాప్రతినిధులు(BRS BC Representatives) అత్యవసర భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud), గంగుల కమాలకర్(Gangula Kamalakar), రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోని బీసీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తుందని ఆరోపించారు. తమలో తమకు తగువు పెట్టుకుని తన్నుకునేలా చిచ్చులు పెట్టే విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఓ పథకం ప్రకారం కాంగ్రెస్‌లోని కొంతమంది ఇలా చేస్తున్నారని.. వారికి బుద్ధి చెప్తామని అన్నారు. తాము అనుకుంటే ఏమైనా చేయగలమని.. చేతకాని వాళ్లం కాదని హెచ్చరించారు. ఒకప్పుడు ఏదో నడిచింది కానీ.. ఇప్పుడు మీ పప్పులు ఉడకవన్నారు. మా ఓట్లతో ఎదిగి.. మమ్మల్నే తొక్కెయాలని చూస్తూ.. మావాళ్లు(మా కుల సంఘాలు, ప్రజలు) చూస్తూ ఊరుకోరని అన్నారు.
మా నాయకత్వం అన్ని కులాలను కలుపుకునిపోతుందని అన్నారు. ఏ కులాన్ని కూడా కించపరచకుండా అన్ని కులాలను కలుపుకుని పనిచేస్తూ ముందుకుపోతున్న మా నాయకులను, మమ్మల్ని కించపరుస్తూ, వ్యంగంగా మాట్లాడుతారా అంటూ పైర్ అయ్యారు. తామందరం కాంగ్రెస్‌పై తాడోపేడో తేల్చుకునేందుకు నిర్ణయించుకున్నామని తెలిపారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు.