Nizamabad Results : ఆనవాయితికి అడ్డుకట్ట
స్పీకర్(Speakers) బాధ్యతలను చేపట్టిన వారు తదనంతరం జరిగే ఎన్నికల్లో విజయం సాధించలేరన్నది ఓ నమ్మకం. నిజం కూడా! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో(andhra Pradesh), ప్రస్తుతం తెలంగాణలో(Telangana), విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఇది కనిపించలేదు. గతంలో స్పీకర్లుగా పని చేసిన మధుసూదనాచారి, సురేశ్‌రెడ్డి, ప్రతిభాభారతి, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇలా అందరూ ఓడిపోయారు.

Nizamabad Results
స్పీకర్(Speakers) బాధ్యతలను చేపట్టిన వారు తదనంతరం జరిగే ఎన్నికల్లో విజయం సాధించలేరన్నది ఓ నమ్మకం. నిజం కూడా! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో(andhra Pradesh), ప్రస్తుతం తెలంగాణలో(Telangana), విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఇది కనిపించలేదు. గతంలో స్పీకర్లుగా పని చేసిన మధుసూదనాచారి, సురేశ్‌రెడ్డి, ప్రతిభాభారతి, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇలా అందరూ ఓడిపోయారు. ఈ భయం కొద్దే స్పీకర్ పదవి ఇస్తామంటే తీసుకోవడానికి చాలా మంది తటపటాయిస్తుంటారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి(Srinivas Reddy) కూడా ముందు స్పీకర్ పదవిని తీసుకోడానికి ఇష్టపడలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఆయనను ఒప్పించి స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు. స్పీకర్లు తిరిగి గెలవరనే సెంటిమెంట్‌కి పోచారం స్వస్తి పలికారు. నిజామాబాద్(Nizamabad) జిల్లా బాన్సువాడ(Bansuwada) నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. ఈ విధంగా ఆనవాయితీకి బ్రేక్ వేశారు.
