కూటమి భవిష్యత్తు గురించిన ఊహాగానాలకు ముగింపు పలికిన ప్రవీణ్ కుమార్
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కలిసి పనిచేస్తాయని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ఏ కూటమిలో భాగం కానందు వల్లనే పొత్తుకు అవకాశం ఉందని తెలుస్తోంది. BRS (ఏ జాతీయ కూటమిలో భాగం కాదు) కాబట్టి.. రాబోయే సార్వత్రిక ఎన్నికలు-2024 కోసం తెలంగాణలో పొత్తుపై ముందస్తు చర్చలకు అనుమతి ఇచ్చినందుకు BSP జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ చారిత్రాత్మక ప్రయత్నంలో పార్టీకి మార్గనిర్దేశం చేసేందుకు మా సెంట్రల్ కోఆర్డినేటర్, ఎంపీ, రామ్‌జీ గౌతమ్ త్వరలో హైదరాబాద్‌కు రానున్నారని ఓ ప్రకటన బీఎస్పీ నుండి వెలువడింది.
కూటమి భవిష్యత్తు గురించిన ఊహాగానాలకు ముగింపు పలికిన ప్రవీణ్ కుమార్, బీఆర్‌ఎస్‌ను ఎన్‌డిఎ లేదా ఇండియా బ్లాక్‌లలో భాగం కానందున బీఎస్పీ హైకమాండ్ తగిన కూటమి అభ్యర్థిగా పరిగణించిందని అన్నారు. రామ్‌జీ గౌతమ్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా సీట్ల పంపకాల ఏర్పాటుపై త్వరలో ఉమ్మడి ప్రకటన ఉంటుందని తెలిపారు. వదంతులను నమ్మవద్దని బీఎస్పీ కార్యకర్తలను ఆయన కోరారు.