బీఆర్‌ఎస్(BRS), బీఎస్పీ(BSP) మధ్య పొత్తు(Alliance) కుదిరింది. లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో ఉభయ పార్టీల అధినేతలు పొత్తుపై చర్చించారు. బీఎస్పీకి రెండు సీట్లు కేటాయించాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్(KCR) నిర్ణయించారు.
బీఆర్‌ఎస్(BRS), బీఎస్పీ(BSP) మధ్య పొత్తు(Alliance) కుదిరింది. లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో ఉభయ పార్టీల అధినేతలు పొత్తుపై చర్చించారు. బీఎస్పీకి రెండు సీట్లు కేటాయించాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్(KCR) నిర్ణయించారు. ఇందులో భాగంగా నాగర్ కర్నూలు(Nagarkarnool), హైదరాబాద్(Hyderabad) లోక్‌సభ స్థానాలను బీఎస్పీకి కేటాయించారు. ఇదిలా ఉంటే నాగర్ కర్నూల్ సీటును బీఎస్పీకి ఇవ్వడాన్ని ప్రభుత్వ మాజీ విప్ గువ్వల బాలరాజు స్వాగతించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ గెలుపు కోసం పాటుపడతామని చెప్పారు. ఇంకోవైపు పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి, హక్కులు కాపాడుకోవడానికి ఈ పొత్తు దోహదం చేస్తుందని ప్రవీణ్‌కుమార్ అన్నారు. వంద రోజుల కాంగ్రెస్ అసమర్థ పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళతామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం భర్తి చేసిన 30 వేల ఉద్యోగాలకు నియామకపత్రాలు అందచేసి తామే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గు చేటని ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ తోనే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోగలమని, నాగర్ కర్నూలు లోక్‌సభ స్థానాన్ని గెల్చుకుని కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని ప్రవీణ్‌కుమార్ అన్నారు.