గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు బిజెపి, బిఆర్ఎస్ ఉప్పు నిప్పుల, గవర్నర్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్నట్లు మాటల యుద్ధం కొనసాగింది. ఉరిమే మేఘాలు వర్షించకుండా చల్లబడినట్లు ఒక్కసారిగా గవర్నర్ తమిళ సై బిఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదిరినట్లు అందరికీ అనుమానం కలుగుతుంది. గతంలో గవర్నర్ తెలంగాణ ప్రభుత్వం పంపించిన అనేక బిల్లులలో పై అభ్యంతరాలు ఉన్నాయని అందుకే ఆమోదించట్లేదని చాలాసార్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ పై ప్రత్యక్ష పోరాటానికి […]

గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు బిజెపి, బిఆర్ఎస్ ఉప్పు నిప్పుల, గవర్నర్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్నట్లు మాటల యుద్ధం కొనసాగింది. ఉరిమే మేఘాలు వర్షించకుండా చల్లబడినట్లు ఒక్కసారిగా గవర్నర్ తమిళ సై బిఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదిరినట్లు అందరికీ అనుమానం కలుగుతుంది.

గతంలో గవర్నర్ తెలంగాణ ప్రభుత్వం పంపించిన అనేక బిల్లులలో పై అభ్యంతరాలు ఉన్నాయని అందుకే ఆమోదించట్లేదని చాలాసార్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ పై ప్రత్యక్ష పోరాటానికి దిగింది. కావాలని ప్రభుత్వాన్ని ఇరకాటల్లో పెట్టాలని ఉద్దేశంతోనే గవర్నర్ చూస్తున్నారని అనేకసార్లు ప్రభుత్వ పెద్దలు ఆరోపించారు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ తమిళసై తెలంగాణ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ నాయకులు కూడా గవర్నర్కు కౌంటర్ ఇచ్చారు.

అంతేకాదు ఇటీవలే రాష్ట్ర ఉభయ సభలు బడ్జెట్ బిల్లు ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపించారు. వెంటనే గవర్నర్ అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం రాజభవన్ లో జనవరి 26 వేడుకలు చేస్తుందో లేదో తెలపాలన్నారు. ప్రభుత్వ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడం గవర్నర్ కూడా ద్రవ్య బిల్లులు పెండింగ్ లో పెట్టారు. ఈ గొడవ హైకోర్టు వరకు వెళ్ళింది. ఇటీవలే ప్రారంభమైన లోక్ సభ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి ఇచ్చే ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు బిఆర్ఎస్ ఎంపీలు ప్రకటించారు. ఇరు పార్టీల మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్న తరుణంలో అధికార పార్టీ రాకకు రాజ్ భవన్ ద్వారాలు తెరుచుకున్నాయి.ప్రభుత్వ పెద్దల మధ్యవర్తిత్వతో ఎట్టకేలకు బడ్జెట్ బిల్లుకు ఆమోద ముద్రపడింది.

దీంతో బిజెపి బిఆర్ఎస్ పార్టీ ఒకటేనని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నాయి. రెండు పార్టీలు మళ్లీ అధికారంలో రావడం కోసం అనేక కుట్రలు పన్నుతున్నాయని బలంగా వినిపిస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో గవర్నర్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం మద్య సాగిన మాటల యుద్ధం నిజమేనా? రాజభవన్, ప్రగతిభవన్ కు దూరం తగ్గిందా? అన్నట్లు రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

Updated On 9 Feb 2023 3:02 AM GMT
Ehatv

Ehatv

Next Story