లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ..ఈడీ విచారణ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు కవిత ఈడీ విచారణ కు హాజరయ్యారు.

లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ..ఈడీ విచారణ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు కవిత ఈడీ విచారణ కు హాజరయ్యారు. అయితే ఈ కేసులో మరో ఏడుగురికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు ఈడీ ముందు విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో మరికొంతమందికి నోటీసులివ్వడం చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే నిందితులకు సంబంధించిన ఛార్జిషీట్లు, రిమాండ్ రిపోర్టులలో కవిత పేర్లను పలుమార్లు ఈడీ ప్రస్తావించింది. దీంతో కవితను అరెస్ట్ చేస్తారనే ప్రచారం టీ పాలిటిక్స్‌లో జోరుగా జరుగుతోంది. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ...కవితను ఈడీ అరెస్ట్ చేయవచ్చని అనడంతో ఇవాళ ఏం జరగబోతుందనేది ఉత్కంఠకరంగా మారింది.

ఇదిలా ఉండగా మరోవైపు ఎమ్మెల్సీ కవిత వీడి విచారణకు హాజరవుతున్న రోజే ఫ్లెక్సీల అంశం ఆసక్తికరంగా మారింది. కవితకు మద్ధతుగా ..ఈడీ , సీబీఐ , బీజెపి బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్ లో పోస్టర్లు కొన్ని ఫ్లెక్సీలు వెలిసాయి . అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు ఈడీ , సీబీఐ రెయిడ్స్ జరగగానే.. కాషాయరంగు పూసుకుని బీజేపీలో చేరిపోయారంటూ ....బిజెపిలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ పలువురు బీజేపీ నేతల ఫోటోలతో ఈ పోస్టర్లు వెలిసాయి . ప్రస్తుత కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, వెస్ట్ బెంగాల్ బిజెపి ముఖ్య నేత సువేంధు అధికారి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలతో ఈ పోస్టర్లు ఉన్నాయి. కానీ ఎమ్మెల్సీ కవిత రెయిడ్స్ కి ముందు తర్వాత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఉన్నాయి. నిజమైన రంగులు వెలసిపోవు అంటూ కొటేషన్తో వెలిసిన పోస్టర్లతో పాటు ....చివర్లో బై బై మోడీ అంటూ హాష్ టాగ్ తో పోస్టర్లు వెలవడం అందరిలో చర్చకు దారి తీసింది.

Updated On 11 March 2023 1:02 AM GMT
Ehatv

Ehatv

Next Story