తెలంగాణ కాంగ్రెస్‌(Telangana Congress) చీఫ్‌ రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి రానున్న 45 రోజులు కఠినంగా గడుస్తాయి. ఎందుకంటే తాను గెలవడంతో పాటు పార్టీని గెలిపించే అదనపు బాధ్యత ఆయనపై ఉంది. సర్వేలు కాంగ్రెస్‌కు ఆధిక్యత చూపిస్తుండటంతో పార్టీ శ్రేణులలో కూడా ఉత్సాహం వచ్చింది. గాంధీభవన్‌(Gandhi Bhavan)లో మునుపటి హడావుడి కనిపిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్‌(Telangana Congress) చీఫ్‌ రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి రానున్న 45 రోజులు కఠినంగా గడుస్తాయి. ఎందుకంటే తాను గెలవడంతో పాటు పార్టీని గెలిపించే అదనపు బాధ్యత ఆయనపై ఉంది. సర్వేలు కాంగ్రెస్‌కు ఆధిక్యత చూపిస్తుండటంతో పార్టీ శ్రేణులలో కూడా ఉత్సాహం వచ్చింది. గాంధీభవన్‌(Gandhi Bhavan)లో మునుపటి హడావుడి కనిపిస్తోంది.

ఇప్పుడు రేవంత్‌రెడ్డి తెలంగాణలో పార్టీని గెలిపించుకుంటారా? ఏనాటికైనా ముఖ్యమంత్రి కావాలన్నా రేవంత్‌ కోరిక నెరవేరనుందా? ఇంతవరకు బాగానే ఉంది, కానీ కొడంగల్‌(Kodangal)లో రేవంత్‌ గెలుస్తారా? లేకపోతే గత ఎన్నికల్లోలాగా ఓడిపోతారా? అంటే చెప్పడం కష్టమంటున్నారు పొలటికల్‌ అనాలసిస్టులు!రేవంత్‌కు కూడా ఈ అనుమానం కలిగే తను సర్వే చేయించుకున్నారు.

మైనస్‌ పాయింట్లు ఎక్కడున్నాయి? ఎక్కడెక్కడ తనకు ప్లస్‌ పాయింట్లు ఉన్నాయి? అన్నది లెక్కలు తీసి పెట్టుకున్నారు. దిద్దుబాటు చర్యలు కూడా చేస్తున్నారు. ఇప్పుడాయన టీపీసీసీ అధ్యక్షుడు. దేనికీ కాంప్రమైజ్‌ కారు. ఓడిపోతే మొదటికే మోసం వస్తుందన్నది ఆయనకు తెలియంది కాదు!కాబట్టి కొడంగల్‌లో సాధన సంపత్తిని మొత్తం ప్రయోగించాలి.

అదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరగాల్సి ఉంటుంది. రాహుల్‌గాంధీ సభల ఏర్పాట్లను చూసుకోవాలి. అభ్యర్థులందరీ తరఫున ప్రచారం చేయాలి.
కిందటిసారి కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ కొడంగల్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయగలిగింది.

ఈసారి కూడా అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. కాకపోతే ఈసారి ఆ ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్‌కు చెందిన ఓ ప్రముఖ నేత అని పొలిటికల్‌ సర్కిల్‌లో వినిపిస్తున్నమాట! రేవంత్‌రెడ్డి ఓట్లను చీల్చడానికి, ఆయనను తన నియోజకవర్గానికే పరిమితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట! ఇందులో నిజమెంతో తెలియదు కానీ స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ సిద్ధమైనా అది జరగకుండా చేసింది రేవంత్‌రెడ్డినేనన్నది షర్మిలకు తెలియంది కాదు. ఈ విషయాన్ని పక్కన పెడితే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేవీపీ రామచంద్రరావు చాలా క్లోజ్‌.. ఆయన ద్వారా బ్రదర్‌ అనిల్‌కుమార్‌ను కొడంగల్‌ బరిలో దింపుతున్నారట!అంటే అనిల్‌ కుమార్‌ గెలుస్తాడని కాదు కానీ, రేవంత్‌రెడ్డికి పడే కొన్ని ఓట్లను చీల్చగలుగుతారు. ఇదే షర్మిలకు కూడా కావాల్సింది. నిజంగానే అనిల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్లను చీల్చగలుగుతారా? బీఆర్‌ఎస్‌కు పరోక్షంగా సాయం అందిస్తారా? చూడాలి మరి...

"Written By : Senior Journalist Sreedhar"

Updated On 18 Oct 2023 6:07 AM GMT
Ehatv

Ehatv

Next Story