తెలంగాణ(Telangana)లో ఎంపీ ఎన్నికల(MP Elections)తో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్(Secunderabad Cantonment) స్థానానికి ఉపఎన్నిక కూడా జరగనుంది. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత(MLA Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక ఏర్పడింది.

తెలంగాణ(Telangana)లో ఎంపీ ఎన్నికల(MP Elections)తో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్(Secunderabad Cantonment) స్థానానికి ఉపఎన్నిక కూడా జరగనుంది. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత(MLA Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక ఏర్పడింది. లోక్ సభతో పాటే ఉపఎన్నిక జరగనుంది. ఉప ఎన్నిక జరగకుండా ఏకగ్రీవానికి సహకరించాలని లాస్య నందిత కుటుంబం కోరుతోంది. కానీ రాజకీయ పార్టీలన్నీ పోటీ చేయడానికే సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా కంటోన్మెంట్‌లో పోటీ చేయడానికి కాంగ్రెస్(Congress0 సిద్ధమైంది. ఇందు కోసం అభ్యర్థిని కూడా ఎంపిక చేసుకున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన శ్రీగణేష్‌ను పార్టీలో చేర్చుకున్నారు. గత ఎన్నికల్లో గద్దర్ కూతురు నిలబెట్టారు కానీ ఆమె మూడో స్థానంలో నిలిచారు. ఈ సారి కూడా గద్దర్‌ కూతురుకు అవకాశం ఇవ్వాలనుకున్నా బలమైన అభ్యర్థిని నిలబెట్టాలన్న ఉద్దేశంతో కంటోన్మెంట్ ప్రాంతంలో మంచి పరిచయాలు ఉన్న శ్రీగణేష్ కాంగ్రెస్ ఆకర్షించింది. ఆయనకు టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్‌ పెద్దలు.

సాధారణంగా ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబసభ్యులకు టికెట్‌ ఇస్తే రాజకీయ పార్టీలు పోటీని పెట్టకుండా ఏకగ్రీవానికి సహకరిస్తాయి. కానీ ఈ సారి పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతుండడంతో పోటీ పెట్టకపోతే పార్లమెంట్ స్థానం పైనా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పోటీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ సారి హోరాహోరీ పోరు ఉంటుందని ఓ నియోజకవర్గంలో గుర్తు లేకుండా చేసుకుంటే సమస్య వస్తుందని కాంగ్రెస్ వర్గాలు పోటీ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. బీజేపీ కూడా తొలుత శ్రీగణేష్‌నే అభ్యర్థిగా పెట్టాలని అనుకున్నా ఆయన పార్టీ మారిపోయారు. దీంతో కొత్త అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. బీఆర్‌ఎస్‌ తరపున ఎవర్ని నిలబెడతారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. తనకే టికెట్‌ కావాలని లాస్య నందిత సోదరి లాస్య నివేదిత మీడియా ద్వారా ఇప్పటికే విజ్ఞప్తులు చేశారు. త్వరలో అధినేత కేసీఆర్‌ను కలిసి తనకే అవకాశం ఇవ్వాలని కోరుతానని ఆమె తెలిపింది. అయితే యువనేత క్రిషాంక్ తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. గత ఎన్నికల్లో కూడా క్రిషాంక్‌కు అవకాశం వచ్చినట్లే వచ్చిపోయిందని.. ఈ సారి తనకు చాన్స్‌ ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తానికి కంటోన్మెంట్‌ ఎన్నిక కూడా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మారనుందనే చెప్పాలి.

Updated On 21 March 2024 1:26 AM GMT
Ehatv

Ehatv

Next Story