Boora Narsaiah Goud : రాజగోపాల్ రెడ్డి శరీరం మాత్రమే బీజేపీలో ఉంది
రాజగోపాల్ రెడ్డి(Rajgopal Reddy) బీజేపీకి(BJP) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్(Boora Narsaiah Goud) స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి శరీరం మాత్రమే బీజేపీలో ఉందని.. ఆత్మ కాంగ్రెస్(Congress) లోనే ఉండిందని అన్నారు.

Boora Narsaiah Goud
రాజగోపాల్ రెడ్డి(Rajgopal Reddy) బీజేపీకి(BJP) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్(Boora Narsaiah Goud) స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి శరీరం మాత్రమే బీజేపీలో ఉందని.. ఆత్మ కాంగ్రెస్(Congress) లోనే ఉండిందని అన్నారు. ఇది బ్రేకింగ్ న్యూస్ ఏమీ కాదు.. అందరూ ఊహించినదేనన్నారు. రాజగోపాల్ రెడ్డి అన్నంత మాత్రాన.. ఆల్టర్నేట్ కాదు అనేది అవాస్తవం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితిలో జనాలు లేరన్నారు. కేసీఆర్‌ను(KCR) ప్రగతిభవన్ నుంచి ఖాళీ చేయించి పనిలో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఉన్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నయం కేవలం బీజేపీ మాత్రమేనన్నారు. తాను పార్టీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేస్తానన్నారు. నాకు భువనగిరి పార్లమెంటు నుంచి పోటీ చేయాలని ఉందన్నారు. కానీ పార్టీ అధిష్టానం తీసుకున్న ఏ నిర్ణయానికైనా శిరసా వహిస్తానన్నారు.
