తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలోకి రాగానే గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రెడ్డి(Bonthu Rammohan Reddy) సతీ సమేతంగా ఆ పార్టీలో చేరిపోయారు. బీఆర్‌ఎస్(BRS) వల్లే తనకు మేయర్ పదవి వచ్చిందన్న సంగతి మర్చిపోయి హస్తం పార్టీ గూటిలోకి వెళ్లారు.
తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలోకి రాగానే గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రెడ్డి(Bonthu Rammohan Reddy) సతీ సమేతంగా ఆ పార్టీలో చేరిపోయారు. బీఆర్‌ఎస్(BRS) వల్లే తనకు మేయర్ పదవి వచ్చిందన్న సంగతి మర్చిపోయి హస్తం పార్టీ గూటిలోకి వెళ్లారు. సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నించారు. ప్రయత్నాలు విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) హ్యాండ్ ఇచ్చారు. పుండు మీద కారం చల్లినట్టుగా బీఆర్‌ఎస్ నుంచే వచ్చిన దానం నాగేందర్(Danam Nagender)కు సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్ దక్కింది. దీన్ని బొంతు తట్టుకోలేకపోయారు. బీఆర్‌ఎస్‌లోనే ఉండి ఉంటే సికింద్రాబాద్ టికెట్ దక్కేదేమో! మొత్తం మీద తీవ్రమైన అసంతృప్తితో ఆయన కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏవరైనా ఏమైనా అనుకుంటారేమోనని తన భార్య శ్రీదేవిని ప్రచారంలో ఉంచారు. తాను మాత్రం ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. బొంతు రామ్మోహన్ మౌనంగా ఉండటంతో ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. అయోమయానికి గురవుతున్నారు. ఏం చేయాలో పాలుపోక దిక్కులు చూస్తున్నారు. ఇంతటితో బొంతు రామ్మోహన్ రాజకీయ జీవితం ముగిసినట్టేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదో ఆశించి కాంగ్రెస్‌లోకి వెళితే ఏదో జరిగి ఎటూ కాకుండా పోయిందని తన అనుచరులతో అంటున్నారట! వారితో తన ఆవేదనను పంచుకుంటున్నారట! ఏదైతేనేమీ చేజేతులా తన రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేసుకున్నారు బొంతు రామ్మోహన్.. ఆయన అలక మాన్పించడం కోసం కాంగ్రెస్ అధిష్టానం నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుందేమో చూడాలి!