భాగ్యనగరంలో నెల రోజులపాటు అంగరంగవైభంగా జరిగే ఆషాడ బోనాల జాతరకు తేదీలు ఖరారయ్యాయి. జూన్ 22న గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారికి తొలిబోనంతో మొదలవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్‌ బేగంపేటలోని హరిత ప్లాజాలో బోనాల ఏర్పాట్లపై మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, మల్లారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మేయర్ విజయలక్ష్మి, డీజీపీ అంజనీ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

భాగ్యనగరంలో నెల రోజులపాటు అంగరంగవైభంగా జరిగే ఆషాడ బోనాల జాతరకు తేదీలు ఖరారయ్యాయి. జూన్ 22న గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారికి తొలిబోనంతో మొదలవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్‌ బేగంపేటలోని హరిత ప్లాజాలో బోనాల ఏర్పాట్లపై మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, మల్లారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మేయర్ విజయలక్ష్మి, డీజీపీ అంజనీ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మీడయాతో మాట్లాడారు.జూన్ 22న గోల్కొండలో ఆషాడ బోనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, వచ్చే 10న రంగం నిర్వహిస్తామని తెలిపారు. జులై 16న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను సీఎం కేసీఆర్‌ రాష్ట్ర పండుగగా ప్రకటించారని చెప్పారు. మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని మంత్రి తలసాని తెలిపారు.

అక్కడ అమ్మవారికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రతి గురు, ఆదివారాల్లో ఉత్సవాలు కొనసాగుతా యని ఆలయ ఈవో శ్రీనివాస్ రాజు తెలిపారు. జులై 20న గురువారం తొమ్మిదో పూజతో ఆషాడ మాసం బోనాలు ముగుస్తాయన్నారు.

ఆషాఢమాసం..

పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాడ మాసం. ఇది సంవత్సరములో 4 వ మాసం. దీనిని శూన్య మాసమని కూడా అంటారు. పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాడ మాసంలోనే తెలంగాణా ప్రాంతంలో సంప్రదాయబద్దమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి, చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.

ఆషాఢ బోనాలు

ఆషాడ బోనాల జాతర అంటే గ్రామదేవతలను పూజించే పండుగ. బోనం అంటే భోజనం అని అర్థం. అన్నం కొత్తకుండలో వండి ఊరేగింపుగా వెళ్లి గ్రామదేవతలకు భక్తితో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం కూడా పోస్తారు. దానిపై దీపం పెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపకు కట్టి పసుపు కలిపిన నీళ్లు చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తారు. ఈ విధంగా బోనాలు సమర్పిస్తే గ్రామ దేవతలు శాంతించి అంటు వ్యాధులు రాకుండా కాపాడుతారని భక్తుల నమ్ముతారు.

తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బోనాల జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. బోనం దేవతలకు సమర్పించే నైవేద్యం, మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం కలిపిన బోనాన్ని మట్టి , ఇత్తడి లేక రాగి కుండలలో మహిళలు తలపై పెట్టుకుని డప్పులతో సంబరంగా గుడికి వెళ్తారు.

బోనాలంటే పోతరాజుల సందడి

మహిళలు బోనాలు తీసుకెళ్లే కుండలను చిన్న వేప రెమ్మలతో పసుపు, కుంకుమ, బియ్యం పిండి ముగ్గుతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచుతారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మలుగా పిలుచుకునే గ్రామ దేవతల గుళ్లను సుందరంగా అలంకరించుకుని బోనాలు సమర్పిస్తారు. బోనాల సందర్భంగా పోతురాజు వేషానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలు తన పుట్టింటికి వెళుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన అనుభూతిని పొందుతారు. ఈ భావనతో భక్తి శ్రద్ధలతో బోనాలను ఆహార నైవేద్యంగా దేవికి సమర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఊరడి అంటారు. పలు ప్రాంతాల్లో పెద్ద పండుగ, వంటల పండుగ అనే పేర్లతో పిలుస్తారు. కాలానుగుణంగా ఇది బోనాలుగా మారింది. బోనాల సందర్భంగా పొట్టేళ్ల రథంపై అమ్మవారిని ఊరేగిస్తారు.

ఆషాడంలో పుట్టింట్లోనే కొత్త పెళ్లికూతురు

ఇక వ్యవసాయ పనులన్నీ ఈ మాసంలోనే రైతులు ప్రారంభిస్తారు. చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు. కాబట్టే ఆ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. ఆ రోజుల్లో కొత్తగా పెళ్లి అయిన అబ్బాయి ఆరు నెలల కాలం అత్త గారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే, సకాలంలో జరగాల్సిన పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు అవి. ఇప్పటి లాగ కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లక పొతే సంవత్సరమంతా దారిద్ర్యంతో బాధ పడవలసిందే. అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు.

ఇంటి ధ్యాసతో పనులు సరిగా చేయరని ఆషాడమాస నియమం పెట్టారు. అంతేకాకుండా, అనారోగ్య మాసం ఆషాడం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, తలనొప్పి మొదలైన వ్యాధులు వచ్చే సమయం, స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు, అనారోగ్య దినాలలోను అశుభ సమయాల లోను, గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల ఆషాడమాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు.

Updated On 26 May 2023 2:40 AM GMT
Ehatv

Ehatv

Next Story