ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' లో పాల్గొన్న ప్రఖ్యాత బాలీవుడ్ గాయని శ్రేయా గోషల్ గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా బాలీవుడ్ గాయని శ్రేయా గోషల్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ఒక గొప్ప కార్యక్రమమని, దీనిలో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు.

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్(Joginapally Santosh Kumar) గారు చేపట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'(Green India Challenge) లో పాల్గొన్న ప్రఖ్యాత బాలీవుడ్ గాయని శ్రేయా గోషల్ గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా బాలీవుడ్ గాయని శ్రేయా గోషల్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ఒక గొప్ప కార్యక్రమమని, దీనిలో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. అన్ని బాధ్యతల కన్నా సామాజిక బాధ్యత మిన్న అని, సమస్త మానవజాతి మనుగడకు మొక్కలే జీవనాధారమన్నారు. మొక్కలను పెంచడం ద్వారా పచ్చదనం పెరిగి పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు.

ప్రకృతికి, పాటకు విడదీయలేని అనుబంధం ఉందని, ఆ రెండింటి సమన్వయంతో మనం సంపూర్ణ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటామన్నారు.

'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' లాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే గొప్ప అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగిపల్లి సంతోష్ కుమార్ గారికి బాలీవుడ్ గాయని శ్రేయా గోషల్(Shreya Ghoshal) కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్ విసిరిన చాలెంజ్ ను స్వీకరించి 'గ్రీన్ ఇండియా చాలెంజ్' లో పాల్గొన్న శ్రేయా గోషల్ ట్విట్టర్ ద్వారా మరో ముగ్గురికి చాలెంజ్ ను విసురుతాన్నారు. ఈ కార్యక్రమంలో 'గ్రీన్ ఇండియా చాలెంజ్' కరుణాకర్ రెడ్డి, రాఘవేందర్ యాదవ్ పాల్గొన్నారు.

Updated On 1 May 2023 2:34 AM GMT
Ehatv

Ehatv

Next Story