కేంద్ర మంత్రి బండి సంజయ్‌(Bandi sanjay) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు

కేంద్ర మంత్రి బండి సంజయ్‌(Bandi sanjay) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌(BRS), కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోశారు. కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందని, బీఆర్‌ఎస్‌ ఔట్ డేటెడ్ పార్టీ అన్నారు. విలీనం, పొత్తులతో ప్రజలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్‌కే ఉందని, అవినీతి పార్టీ బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి పట్టలేదని సంజయ్‌ అన్నారు. రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్(congress) దిష్టిబొమ్మలు కాల్చేస్తున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు.. రుణమాఫీసహా 6 గ్యారంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకు విలీన డ్రామాలు ఆడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నాయి. రుణమాఫీపై కాంగ్రెస్‌ మాట తప్పిందన్నారు. 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేస్తారా? అని ప్రశ్నించారు. రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో 40 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి బడ్జెట్లో రూ.26 వేలు కేటాయించి చివరకు రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తారా? అని కాంగ్రెస్‌ను అడిగారు. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు అర్థమైందని తెలిసే విలీన డ్రామాలాడుతూ చర్చను పక్కదారి పట్టిస్తున్నారని బండి సంజయ్‌ అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story