తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సంచలన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బెదిరించాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీలను ప్రయోగించినట్లు తనపై ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తున్నారని.. చేతిలో అధికారం ఉందని వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ భాయ్ నన్ను బెదిరించాలని చూస్తున్నారు.. ఏదైనా రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా లేదా ఆ పార్టీ నాయకుడికి వ్యతిరేకంగా మార్ఫింగ్ వీడియోను విడుదల చేస్తే వారు ఫిర్యాదు చేయాలి.. కానీ ఏకంగా ఎంహెచ్ఏ ఫిర్యాదు చేసిందన్నారు. బీజేపీ నేతలు ఈడీ, సీబీఐ లాగా ఢిల్లీ పోలీసులను ఉపయోగించుకుంటున్నారన్నారు. కోర్టులు ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. నేను నా ట్విట్టర్ అకౌంట్ వివరాలను అధికారులకు ఇచ్చానని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియా యుగంలో ఇష్టారాజ్యంగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.. మీరు దాని కోసం ఒక ముఖ్యమంత్రిని నిందించి, అతనికి నోటీసు పంపారు. వారి చేతుల్లో ఏజెన్సీలు ఉన్నాయి, ఇది సరైనది కాదని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు ​​జారీ చేశారు. రేవంత్ రెడ్డి తన మొబైల్ ఫోన్‌తో మే 1న ఢిల్లీ పోలీసుల IFSO యూనిట్ (సైబర్ యూనిట్) ముందు హాజరు కావాలని కోరారు.

Updated On 9 May 2024 5:26 AM GMT
Yagnik

Yagnik

Next Story